పాత విమర్శల్లో కొత్త మాటలు అందుకున్న జగన్ 

ప్రజా సంకల్పయాత్రలో కొత్త పల్లవి అందుకున్నారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. యాత్రకు మీడియా పెద్దగా ప్రచారం ఇవ్వడం లేదు. గతంలో  సిఎం చంద్రబాబునాయుడు, ఆయన కుటుంబం పై వ్యక్తిగత విమర్శలు చేశారు జగన్. ఆ తర్వాత ఆ మాటలను పక్కన పెట్టి తాను ఏం చేస్తాడో చెప్పాడు. అయినా సరే ప్రచారంలో పెద్దగా మార్పు లేదు. కానీ ఇప్పుడు మరోసారి చంద్రబాబు కుటుంబం పై ఆరోపణలు చేస్తున్నాడు జగన్. 
జనవరి 26న సి.ఎం నివాసంలో జాతీయ జెండాను భువనేశ్వరి ఎగురేశారు. దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి సకాలంలో తిరిగి అమరావతికి చేరుకోలేక పోయారు. విమానం ఆలస్యం కావడమే ఇందుకు కారణం. ఫలితంగా చంద్రబాబు లేకుండానే రిపబ్లిక్ వేడుకలు జరిగాయి. చంద్రబాబు దావోస్ లో ఉండగానే… హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సిఎం కుర్చీలు కూర్చుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇది కాకతాళీయంగా జరిగింది. వీటన్నింటిని విపక్ష నేత జగన్ తప్పు పట్టారు. చంద్రబాబు భార్య జెండా ఎగురేస్తోంది. వియ్యంకుడు సి.ఎం సీట్లు కూర్చుంటారు. సి.ఎం విదేశాలకు వెళ్లి రిపబ్లిక్ వేడుకలకు దూరంగా ఉంటారని విమర్శించారు. 
ఆ సంఘటనలకు చంద్రగ్రహాణానికి పోలిక పెట్టారు జగన్. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టిందని ఆరోపించారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులో సాగుతోంది. ఈ సందర్భంగా జగన్ ‘రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం  చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి అక్రమ నివాసంలో నివాసం ఉంటున్నాడనే ప్రచారం ఉంది. ఆ అక్రమ నివాసంలోనే సీఎం భార్య జెండావందనం చేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి విదేశాలకు వెళితే.. ఆయన బావమరిది సీఎం కూర్చీలో కూర్చున్నారని చెప్పారు. అంతే కాదు… పూజారులు పూజలు చేయాల్సిన దుర్గమ్మ గుడిలో తాంత్రికులు, మాంత్రికులు పూజలు చేస్తున్నారని విమర్శించారు. 
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా రూ. 20, 30 కోట్లకు ఎరవేశారని పాత పాటే పాడారు జగన్. రాష్ట్రపతి కుటుంబం రాష్ట్రానికి వస్తే.. అక్రమ బోటులో, లైసెన్స్‌లేని బోటులో సిగ్గులేకుండా తిప్పారని విమర్శించారు. పుష్కరాల సమయంలో తన షూటింగ్‌ కోసం ముఖ్యమంత్రి అక్షరాల 29మంది ప్రాణాలు బలితీసుకున్నారు’ అనిమరోసారి ధ్వజమెత్తారు. పదే పదే అవినీతి జరిగింది. అక్రమాలు జరిగాయి. ప్రభుత్వం ఏం పని చేయలేకపోయిందని చెబితే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. మీడియాలోను ప్రచారం రావడం లేదు. అందుకే చంద్రబాబు భార్య, వియ్యంకుడు, కుమారుడు, సిఎం టార్గెట్ గా విమర్శించాడు జగన్. విషయం ఏదైనా ఇవాళ మాత్రం మీడియాలో పెద్ద ఎత్తున ఈ అంశం ప్రచారానికి నోచుకుంది.
ప్రభుత్వ కార్యక్రమాల్లోని లోటు పాట్లను విపక్ష నేతగా చెప్పాలే గానీ ఇలా వ్యక్తిగత విమర్శలు చేయడం వల్ల జగన్ కు లాభం కంటే నష్టం జరుగుతుందని చెబుతున్నారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. నంద్యాల ఉప ఎన్నికల్లో ఇలానే సిఎంను ఉరి తీయాలి. చంపేయాలని చెప్పడంతో వైకాపా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*