లాస్ యాంజిల్స్ లో ఎన్ఆర్ఐ టిడిపి,ఎపి ఎన్ఆర్టి సభ్యులతో సమావేశం అయిన మంత్రి నారా లోకేష్

ఎన్ఆర్ఐ టిడిపి లాస్ యాంజిల్స్,ఎపి ఎన్ఆర్టి సమావేశంలో మంత్రి నారా లోకేష్…

రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నాం

రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితి లో మన రాష్ట్ర ప్రయాణం మొదలయ్యింది

గత మూడున్నర ఏళ్లలో సమస్యలు అధిగమించి అభివృద్ధి సాధించాం

మిగిలిన దక్షణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో తలసరి ఆదాయం తక్కువుగా ఉంది

తలసరి ఆదాయం పెంచడానికి అనేక చర్యలు తీసుకుంటున్నాం

పారిశ్రామిక అభివృద్ధి కి అనేక చర్యలు తీసుకున్నాం. అనేక పాలసీలు తీసుకొచ్చాం.రాయితీలు కల్పిస్తున్నాం

కియా,ఇసుజూ,అపోలో టైర్స్ లాంటి పెద్ద సంస్థలు మన రాష్ట్రానికి వచ్చాయి

ఐటి రంగంలో గత మూడున్నర ఏళ్లలో 24 వేల ఉద్యోగాలు కల్పించాం

ఆంధ్రప్రదేశ్ లో ఐటి రంగం ఊపందుకుంది.హెచ్ సిఎల్, కాన్డ్యూయెంట్,ఎఎన్ఎస్ఆర్,జోహో, ఫ్రాంక్లిన్ లాంటి పెద్ద కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసాం

ఫాక్స్ కాన్,సెల్ కాన్,కార్బన్,డిక్సన్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి.మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి రాబోతున్నాయి

2019 నాటికి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన పూర్తి చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం

మూడున్నర ఏళ్లలో 14 వేల కిలోమీటర్ల సిసి రోడ్లు వేసాం.అండర్ గ్రౌండ్ డ్రైనేజ్,ఎల్ఈడి వీధి దీపాలు, ప్రతి ఇంటికి కులాయి ద్వారా తాగునీటిని అందిస్తున్నాం

రాజధాని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి

వ్యవసాయాన్ని లాభసాటిగా చేయ్యడం, రాష్ట్రంలో నీటి కొరత లేకుండా చెయ్యడానికి నదుల అనుసంధానం చేస్తున్నాం

గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం చేసి,ఒకే సీజన్ లో 105 టిఎంసి నీళ్లు కృష్ణా డెల్టాకు ఇచ్చాం

అమెరికా లో తెలుగు వారి తలసరి ఆదాయం సంవత్సరానికి 86 వేల డాలర్లు ఉంది

రాబోయే మూడు ఏళ్లలో అమెరికా లో ఉన్న తెలుగు వారి తలసరి ఆదాయం 1 లాక్షా 50 వేల డాలర్లకు తీసుకువెళ్లాలి అని లక్ష్యంగా పెట్టుకున్నాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఎపి ఎన్ఆర్టి ఆధ్వర్యంలో అమెరికా లో నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహిస్తాం

పాత టెక్నాలజీలకు కాలం చెల్లింది.బ్లాక్ చైన్,ఫిన్ టెక్,బిగ్ డేటా,డేటా అనలిటిక్స్ లాంటి అధునాతన టెక్నాలజీలు వస్తున్నాయి.కాలానికి అనుగుణంగా నైపుణ్యం పెంచుకోకపోతే ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది

నిపుణులతో శిక్షణ,మౌలిక వసతులు మేము కల్పిస్తాం.ఎన్ఆర్ఐ లు అంతా ఒక వేదిక పైకి వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించాలి

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడానికి అనువైన వాతావరణం ఉంది.స్టార్ట్ అప్ కంపెనీలను ప్రోత్సహించేందుకు
ప్రభుత్వమే 100 కోట్ల నిధులు కేటాయించింది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*