రామ్ చరణ్ సంగతులను వీడియోతో చెబుతున్న ఉపాసన

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు సంబంధించిన విషయాలు ఏమున్నా భార్య ఉపాసన వెంటనే స్పందిస్తారు. సోషల్ మీడియాను ఆమె బాగా ఫాలో అవుతారు. రంగస్థలం సినిమా టీజర్ రావడమే ఆలస్యం రామ్ చరణ్ ఇంటికి క్యూ కట్టారు అభిమానులు. టీజర్‌ అదిరిపోయిందన్నా..అంటూ హంగామా చేశారు. మిరపకాయ టపాకాయలు పేల్చి సందడి చేశారు. అభిమానులు టపాసులు కాలుస్తున్న వీడియోను చరణ్‌ సతీమణి ఉపాసన ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘మా ఇంటి ముందు అభిమానులు ఇలా టపాసులు పేల్చారు. మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు టీజర్‌ నచ్చిందని ఆశిస్తున్నాం’ అని ఉపాసన ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత టీజర్‌ విడుదలయ్యాక చరణ్‌ తన ఇంటి వద్దకు వచ్చిన అభిమానులను ‘టీజర్ ఎలా ఉంది’ అని అడగడం ఆసక్తికరమే. ఆ గోలలో ఏం అడుగుతున్నారో సరిగా అర్థం కాకపోయినా బాగుందని కింద నుంచి అభిమానులు సైగ చేశారు. అందరికీ ధ్యాంక్స్ చెప్పిన చరణ్‌ ఇంటిలోపలికి వెళ్లిపోయారు.
నా పేరు సిట్టిబాబండీ. ఈ ఊరికి మనమే ఇంజనీరు. అందరికీ సౌండ్‌ వినపడిద్దండి. నాకు సౌండ్‌ కనపడిద్దండి. అందుకే నన్ను సౌండ్‌ ఇంజినీర్‌ అంటారండి’ అని గోదావరి యాసతో మాట్లాడారు రామ్‌చరణ్‌. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం.  సమంత కథానాయిక. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్‌ కు బాగానే స్పందన వస్తోంది. ఇలా టీజర్ విడుదలైందో లేదో అలా అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, ధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి వంటి చాలా మంది రామ్ చరణ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. మార్చి 30న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబాయ్ సినిమా అజ్ఞాతవాసి ప్లాప్ తో అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కాబట్టి ఈ సినిమా పై మెగా అభిమానులు అంచనాలు అంతగా పెట్టుకోవడంలేదు. అవసరానికి మించి ప్రచారం వస్తే పవన్ సినిమాలా ఉంటుందని భయపడుతున్నారు. అందుకే మాములుగానే దానికి స్పందిస్తున్నారు మెగా ఫ్యాన్స్. కానీ ఫ్యాన్స్ కోసం వీడియోలు తీసి మరీ ఉపాసన పోస్టు చేయడం చర్చనీయాంశమైంది

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*