చంద్రబాబు ఫోటోకు పాలాభిషేకం…

అనంతపురం. ఈ జిల్లా పేరు చెబితేనే కరవు పేరు గుర్తుకు వస్తోంది. అలాంటి నేలను సస్యశ్యామలంగా చేసే పని జరుగుతోంది. ఫలితంగా ఏళ్ల తరబడి నీళ్ళు లేక నిర్జీవంగా మారిన భైరవానితిప్ప, పేరూరు డ్యామ్ లు ఇప్పుడు నిండుకుండలా మారాయి. వాటికి నీళ్లు వదలడమే ఇందుకు కారణం. దాని ఆయకట్టు కృష్ణా జలాలతో పొంగి పొర్లుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీ మేరకు పరిటాల రవి వర్ధంతి రోజున ఈ రెండు డ్యామ్ లకు జీవోలు జారీ చేయించారు. అందుకే 13 ఏళ్ల తరువాత, పరిటాల రవి చివరి కోరిక తీర్చినట్లు అయింది. వేలాది ఎకరాల ఆయకట్టులో మళ్లీ పచ్చదనం రానుంది. వేలాది ఎకరాల భూమి సాగులోకి రానుంది. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన సిఎం చంద్రబాబుకు అనంతపురం జనం నీరాజనాలు పడుతున్నారు. 
మంత్రి పరిటాల సునీత ఇంటి వద్దకు ఆపార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల బిందెలతో వచ్చారు. చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచారు. బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కరవు పేరు చెబితేనే భయపడే అనంతవాసులకు ఇప్పుడు కృష్ణాజలాలుతోడుగా ఉంటున్నాయి. పంటలు ఎండిపోయి అప్పులు చేసుకుంటున్న అన్నదాతకు ఆసరగా ఉంటున్నాయి. ఇక ఆత్మహత్యలు వద్దని చెబుతున్నాయి. 
2016, ఆగష్టు 15న అనంతపురం జిల్లాలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు హామీనిచ్చారు. పేరూరుకి కృష్ణా నీళ్ళు తీసుకువస్తామని ప్రస్తావించారు. చెప్పడమే కాదు.. ఈనెల 11న ధర్మవరంలో జరిగిన జన్మభూమిలో, పరిటాల రవి కలల ప్రాజెక్ట్ గురించి, త్వరలో మంచి వార్త వింటారని చెప్పారు. అన్నట్లుగా ఈ నెల 24న మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వర్ధంతి సందర్భంగా జీవోలు జారీ చేశారు. త్వరలోనే ఈ ప్రాంతాలకు నీరు రానుంది. 
అనంతలో కృష్ణా జలాలు అందించేందుకు ప్రభుత్వం రూ. 968.89 కోట్లు మంజూరు చేసింది. ఎడారిగా మారిపోతున్న రాయదుర్గం ఇప్పుడు బీటీపీతో ఫలితం పొందనుంది. వేదవతి-హగరి నదులు తిరిగి బలం పంజుకోనున్నాయి.  బీటీపీ కింద 23,323 ఎకరాలకు నీరందించాలని జీవోలో పొందుపరిచారు. బీటీపీ కింద గల 12వేల ఎకరాలతో పాటు అదనంగా మరో 10,323 ఎకరాల ఆయకట్టుకు నీరిందించవచ్చుననేది నిపుణుల మాటగా ఉంది. 
దశాబ్దాల కాలంగా ఎదురు చూస్తున్న కల నెరవేరనుంది. పేరూరు డ్యాంకు నీరించ్చేందుకు ప్రభుత్వం జీవో జారీ చేయడం పై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాప్తాడు నియోజకవర్గం సస్యశ్యామలం కానుంది. పరిటాల కుటుంబంతో పాటు నియోజకవర్గ ప్రజలు చంద్రబాబుకు రుణపడి ఉంటారని చెప్పారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*