చెప్పుతోనే స‌మాధానం…..

రాజ‌కీయ నాయ‌కులు అనేక అంశాల‌ను ప్ర‌స్తావిస్తారు….. అనేక హామీలు గుప్పిస్తారు…. వ్య‌తిరేక పార్టీ నాయ‌కులను విమ‌ర్శిస్తారు. మైకు దొరికిందంటే చాలు వారు చెప్పే శ్రీరంగ నీతులు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వినేవారికి ఎబ్బెట్టుగా ఉంటాయి. ఇందులో నో డౌట్. కాని ఏం చేస్తాం ఖ‌ర్మ అంటూ స‌ర్థుపుకుపోతాం. ఇదంతా నిన్న‌టి వ‌ర‌కు . ఇప్పుడు ప‌రిస్థితి మారింది. నాయ‌కుడు పై వ్య‌తిరేక‌త‌ను తెలియ‌చేసేందుకు అనేక ప‌ద్ద‌తులు వ‌చ్చాయి. సోష‌ల్‌మీడియా వేధిక‌గా మారింది. ఇలాంటి త‌రుణంలో నాయ‌కుల‌పై త‌మ‌లో ఉన్న వ్య‌తిరేక‌త‌ను చూపించేందుకు కొంత మంది చెప్పులు విస‌ర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వారం రోజుల్లో ఇలాంటి చేదు అనుభ‌వాల‌ను అస‌వుద్దిన్ ఓవైసీ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చ‌వి చూశారు. ముంబాయి నాగ్ పధ ప్రాంతంలో జరిగిన సభలో ఓవైసీ  మాట్లాడుతున్న సమయంలో ఓ వ్య‌క్తి ఆయ‌న మీద‌కు చెప్పు విసిరాడు. ఆ బూటు అసవుద్దీన్ ఓవైసీకి తగలలేదు. బూటు విసిరిన ఘటనను గమనించినా, ఒవైసీ వెనక్కి తగ్గకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. విద్వేష భావజాలం కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. జ‌న‌సేన పెట్టి రెండు రాష్ట్రాల్లో ప‌ర్య‌టిస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాన్వాయ్ ఖ‌మ్మం జిల్లాకు చేరింది. అక్క‌డ ఆయ‌న ప్ర‌సంగిస్తుండ‌గా అగంత‌కుడు బూటు విసిరాడు. అది ఆయ‌న కారుకు త‌గిలింది. గ‌మ‌నించిన ప‌వ‌న్ నన్ను ఎంతమంది విమర్శించినా సంతోషమే… ప్రజా సమస్యల పరిష్కారం కోసం తనపై ఎలాంటి దాడులు జరిగినా సిద్ధమేనన్నారు. అయితే చెప్పు తో నిర‌స‌న ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌జా సంఘాల నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఇలాంటి సంస్ర్కతి భ‌విష్య‌త్తు రాజ‌కీయాల్లో మంచిది కాద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*