సముద్రతీరంలో చమురు నిక్షేపాల వెలికి తీతకు ఒప్పందం

పెట్టుబడులు పెట్టనున్న సౌదీ ఆర్మ్ కో కంపెనీ
దావోస్ కు వెళ్లాడో లేదో పని ప్రారంభించాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. సమీక్షలు, సమావేశాలు, భేటీలు, విందులు, చర్చవేదికలతో ఆకట్టుకుంటున్నాడు. క్షణం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. ఇప్పటి వరకు 14 సార్లు దావోస్ కు వెళ్లి వచ్చాడు చంద్రబాబు. అక్కడ మైనస్ డిగ్రీల చలి. అయినా సరే కోటు జోలికి పోలేదా పెద్ద మనిషి. తనకు అలవాటు అయిన ప్రాంతంలో బిజీ బిజిగా గడుపుతున్నాడు. ఫలితం సాధించాడు. సౌదీ ఆర్మ్ కో సంస్థ తన పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్ లో పెట్టించేందుకు ఒప్పించాడు. ఫలితంగా ముడి చములు నిక్షేపాల సంస్థ ఏపీకి రానుంది. 
ఆంధ్రప్రదేశ్‌కు 974 కి.మీ సముద్రతీరం ఉంది. అక్కడే కాదు… కృష్ణా-గోదావరి బేసిన్ లోను అపార చమురు నిక్షేపాలు ఉన్నాయి. పెట్రోలియం శుద్ధి పరిశ్రమల ఏర్పాటుకు దేశంలో తమ రాష్ట్రం ఎంతో అనుకూలమని సౌదీ ఆర్మ్‌కో సంస్థకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పిన మాట. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీతో సమావేశమయ్యారు. ఏపీలో ఉన్న పరస్థితులు, భౌగోళిక స్వరూపాన్ని ఆయన ముందు పెట్టారు. ఇక్కడ పారిశ్రామిక కారిడార్లున్నాయని, కృష్ణ పట్నం వంటి విషయాలను ప్రస్తావించారు. ఇక్కడ రిఫైనరీ ఏర్పాటు చేస్తే వాణిజ్యపరంగా ఎంతో లాభసాటి అవుతుందని చెప్పారు. పెట్రోలియం, రసాయన పరిశ్రమల ఏర్పాటుకు, విస్తరణకు తమ రాష్ట్రంలో ఇప్పటికే సానుకూల వాతవరణం ఉందని గుర్తు చేశారు. 
హెచ్.పి.సి.ఎల్, గెయిల్ కార్యకలాపాలు ఆంధ్రప్రదేశ్ సాగుతున్న సంగతిని వివరించారు. ఏపీలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజనీరింగ్&టెక్నాలజీని స్థాపించనున్న సంగతి చెప్పారు. ఫలితంగా నిపుణులు చౌకధరకే అందుబాటులో ఉంటారని తెలిపారు. అంతే కాదు… పెట్రోలియం పరిశ్రమల ఏర్పాటుకు కోస్తాతీరం అనువుగా ఉంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అంతే సౌదీ ఆర్మ్‌కో ప్రధాన కంపెనీ ఆలోచన చేసింది. కృష్ణ పట్నంలో రిఫైనరీ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. ఆ కంపెనీ ప్రతినిధులు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ముంబయ్‌లో సౌదీ ఆర్మ్‌కో ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు తుది భేటీ జరపనున్నారు. 
సౌదీ ఆర్మకో కంపెనీ మహారాష్ట్రలో 40 బిలియన్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని ఆలోచించింది. ఇందుకు ఐఓసిఎల్, హె.పి.సి.ఎల్, బి.పి.సి.ఎల్ కంపెనీలతో కలిసి మెగా రిఫైనరీ ఏర్పాటు చేయాలని ఆలోచించింది. కానీ అది ఆచరణకు రాలేదు. సౌదీ ఆర్మ్ సంస్థ రిఫైనరీ ఏర్పాటుకు అన్ని అవకాశాలు, సామర్ధ్యం ఉన్న కీలక ప్రదేశంగా ఇప్పుడు కృష్ణ పట్నం ప్రాంతాన్ని గుర్తించింది. ఈ కంపెనీ ఢిల్లీలో ఆర్మ్‌కో ఏషియా-ఇండియా శాఖ కార్యాలయాన్ని ప్రారంభించింది. భారత పశ్చిమ తీరంలో భారీ చమురు శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. భారత్‌లో మార్కెట్‌లో మరింత వాటా దక్కించుకోవటానికి ఈ సంస్థ కార్యకాలాపాలు నిర్వహిస్తోంది. వారితో మాట్లాడి ఒప్పించడంలో చంద్రబాబు సఫలమయ్యాడనే చెప్పాలి. 
కోస్తా తీరంలోని 640 చ.కి.మీ దూరం చమురు, రసాయనాలు, పెట్రోకెమికల్స్ ఇన్వెస్టిమెంట్ కు అనుకూలంగా ఉంది. భారీ రిఫైనరీని ఇక్కడకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వచ్చే నెలలో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ పెట్టుబడిదారుల సదస్సుకు సౌదీ ఆర్మ్‌కో ప్రెసిడెంట్ సైద్ అల్ హద్రమీ రానున్నారు. భారత్‌కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు చంద్రబాబు చూపిస్తున్న చొరవను ఆయన మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా కాకుండా సీఈఓగా వ్యవహరిస్తూ సౌదీ ఆర్మ్‌కో తో పాటు.. పలు కంపెనీలతో మాట్లాడే తీరు దావోస్ లోనే చర్చనీయాంశమైంది. 
చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణ, ఉత్పత్తి, ఎల్.పి.జీ ఉత్పత్తి, చమురు శుద్ధి, చమురు పంపిణీ, క్రూడ్ ఆయిల్ మార్కెటింగ్ విభాగాల్లో ఇక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదు.  
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*