లోకేష్ కోసం నేతల త్యాగాలు…

ఆంధ్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఆయన జన్మదినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నారు. అభిమానులు, అనుచరులే కాదు.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వేడుకల్లో పాల్గొనడం విశేషం. నందిగామ శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య తన నివాసంలో మంత్రి లోకేష్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 13 జిల్లాల్లో ఆ పార్టీ యువనేతలు వేడుకలు చేస్తున్నారు. దావోస్ లో ఉన్న లోకేష్ కు సిఎం చంద్రబాబుతో పాటు.. మంత్రి యనమల తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. 
లోకేష్ కోసం సీట్ల త్యాగం…
వార్డు సభ్యుడుగాను పోటీ చేసి గెలవలేదు నారా లోకేష్. విపక్షాలు పదేపదే ఇదే మాట అంటున్నాయి. అందుకే తన ఎమ్మెల్సీ సీటుకు రాజీనామా చేసి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. హిందూపురంలో పోటీ చేస్తారని, కాదు కాదు గుడివాడలో అని అక్కడ కాకుండా గుంటూరు జిల్లాలోని మరో నియోజకవర్గం అంటూ ప్రచారం వచ్చింది. కానీ అది కేవలం ప్రచారం మాత్రమే. కానీ ఇప్పుడు ఇద్దరు మంత్రులు తన సీట్లు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారు. 
వారిలో ఒకరే చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే, మంత్రి అమర్ నాథ్ రెడ్డి. కుప్పంలోని పలు మండలాలు పలమనేరులో కలిశాయి. టీడీపీకి అక్కడ గట్టి పట్టుంది. అందుకే అక్కడ లోకేష్ పోటీ చేస్తే తాను పుంగనూరుకు వెళతానని ఆయన ప్రతిపాదించారు. ఈ సంగతి గమనించిన మంత్రి గంటా శ్రీనివాసరావు స్వామి భక్తి చూపించేందుకు ముందుకు వచ్చారు. లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయడమే న్యాయమని చెప్పారు. చంద్రబాబు రాయలసీమ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నందున లోకేశ్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలని కోరారట. లోకేష్ వస్తానంటే తాను తన భీమిలిని ఇచ్చేందుకు సిద్దమని చెప్పారట. ఇప్పటికే చాలా నియోజకవర్గాలు మారిన గంటా మళ్లీ అక్కడ పోటీ చేసినా గెలవరట. అందుకే భీమిలిని ఎవరికో ఒకరికి అంటగట్టి తాను మరో చోటకు వెళ్లాలనే ఆలోచన చేస్తున్నారు. అందుకే లోకేష్ ను ఉత్తరాంధ్ర రావాలని ఉత్తుత్తిగానే చెబుతున్నారట. 
ఎవరు ఏం చెప్పినా లోకేష్ ఏమనలేదట. ఎక్కడ పోటీ చేయాలి. ఏ సీటు నుంచి ఎన్నికవ్వాలనేది అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారు. కాబట్టి ఎవరు ఇబ్బంది పడవద్దని సున్నితంగా కాదని చెప్పారని తెలుస్తోంది. 

1 Comment

  1. lokesh andhrapradesh lo poti cheyadu. may be america president elections lo contest chesthademo .

    next America president Nara lokesh babu(alias Pappu).

Leave a Reply

Your email address will not be published.


*