ఏపీ లెక్కల్లో తప్పులు ఉన్నాయంటున్న కేంద్రం

తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో అర్థం కావడం లేదు. కేంద్రానికి ఏపీ పంపించే లెక్కల్లో తప్పులు ఉంటున్నాయి. కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి గతంలో చాలా సార్లు ఇదే విషయం ప్రస్తావించారు. పోలవరం నిర్మాణమే కాదు.. చాలా విషయాల్లో కేంద్రం చెబుతున్న లెక్కలకు రాష్ట్రం చూపిస్తున్న వాటికి పొంతన లేదు. ఫలితంగా అనుమానాలకు తావిస్తోంది. ముందు పోలవరం లెక్కలను సరి చేసి ఇవ్వాలని కేంద్రం రాష్ట్రానికి చెప్పిందనే ప్రచారం వచ్చింది. తాజాగా అలాంటి లెక్కలనే కేంద్ర మంత్రి సుజనా చౌదరి పట్టుకొచ్చారట.
ఏపీ ప్రభుత్వం తయారు చేస్తున్న లెక్కలను కేంద్రం నమ్మడం లేదంటున్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రూ. 16,447 కోట్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం లెక్కలు పంపింది. వెంటనే తమకు రావాల్సిన మొత్తాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్రానికి లేఖ రాశారు. కానీ తాజాగా కేంద్రం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం రూ. 12,700 కోట్ల వరకే ఏపీకి ఈ మొత్తం ఇవ్వాలని సమాచారం వచ్చింది. అదే నిజమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తేల్చారట. ఫలితంగా ఏపీ ప్రభుత్వం రావాల్సిన మొత్తానికి రూ. 3,747 కోట్ల మేర గండి పడింది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఈ సంగతిని ముఖ్యమంత్రికి తెలియచేశారు. ఫలితంగా చంద్రబాబు ఆర్దిక మంత్రి యనమలతో పాటు ఆయా సంబంధిత సీనియర్ అధికారులతో చర్చలు జరిపారు. మనం ఏం చేయాలి. ఆ నిధులు రావాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి ఆరా తీశారు.
అసలే ఏపీ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. లెక్కల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఇప్పుడు ఏపీకి ఇచ్చే నిధుల విషయంలోను అలానే వ్యవహరించడం చర్చనీయాంశమైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*