TDP తీర్ధం పుచ్చుకొనున్న వంగవీటి రాధ?

విజయవాడలో మరో రాజకీయాల్లో సంచలనం జరగనుంది. వైసీపీ అధినేత జగన్ వెంటే ఉంటానని చెప్పే వంగవీటి రాధ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారంటున్నారు. కొందరు టీడీపీ నేతలు ఆయనతో టచ్ లో ఉన్నారని, పార్టీలోకి ఆయనను ఆహ్వానించారని తెలుస్తోంది. మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లకు ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వడం లేదని మరోచోట పోటీ చేయాలని జగన్ ఆదేశించడమే ఇందుకు కారణమంటున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి తనకు టికెట్ ఖాయం చేసిన పక్షంలో పార్టీ మారేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ విషయమై తమతో చర్చించారని రాధ ప్రధాన అనుచరులు చెబుతున్నారు. రాధ నోటినుంచి అధికారికంగా ఏ ప్రకటన రాలేదు. టీడీపీ వర్గాలు, అటు ఆయన అనుచరులు పార్టీ మార్పు ఖాయమని చెబుతున్నారు. 
వంగవీటి రాధతో చర్చలు పూర్తయ్యాయని తెలుగుదేశం వర్గాలు వెల్లడిస్తున్నాయి.  వైసీపీలో తనకు తగినంత ప్రాధాన్యం లేకుండాపోయిందని రాధ కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నారట. గౌతం రాజు లాంటి వారు వంగవీటి రంగాకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినా పట్టించుకోలేదనే అక్కసుతో ఉన్నారట. గౌతం రాజును పార్టీ నుంచి తప్పించారని ప్రకటించినా..ఇంకా వైకాపా నేతలు ఆయన ఇంటికి వెళుతుండటం రాధాలో మరింతగా కోపాన్ని పెంచుతోందట. అంతే కాదు…రంగా కుటుంబ సభ్యులకు వైకాపాలో తగిన ప్రయార్టీ లేకుండా పోతుందని..వాపోతున్నారట. అందుకే టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
సి.ఎం చంద్రబాబు ఇందుకు ఓకే అన్నారంటున్నారు. రాధా పార్టీ మారితే ఆ మేరకు కాపు ఓట్లు టీడీపీవైపు వచ్చే వీలుంది. వైకాపాకు షాక్ అవుతోంది. ఇంకోవైపు వంగవీటి రాధాతో వైకాపా కీలక నేతలు బుజ్జగింపు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఇంకా ఒక కొలిక్కి రాలేదంటున్నారు. 

2019 లోను YCP అధికారం లోకి రాదని వంగవీటి రాధ బలంగా నమ్ముతున్నారు

1 Comment

  1. ఇందులో నిజం ఎంతో తెలియదు. ఒకవేళ, ఆయన టీడీపీ లో చేరినా, జగన్ కు ఒచ్చే నష్టం ఏమీ లేదు. అలాగే టీడీపీ కి వచ్చే లాభం ఏమీ వుండదు. ఈ రోజు విజయవాడ ప్రజల ఆలోచనా విధానం మారింది. పాత రోజుల్లో లాగ గుడ్డి గా, కులం బట్టి,నాయన పేరు మీద ఓట్లు వేసే అవకాశం లేదు. ఆ విధంగా రాధా. ప్రభావం ఏమీ వుండదు.

Leave a Reply

Your email address will not be published.


*