అన్నొస్తున్నాడు–జగన్_పాదయాత్ర

నడిచి నడిచీ కాళ్ళు బొబ్బలెక్కాయి.. ముద్దులు పెట్టి పెట్టీ పెదాలు వాచిపోయాయి… ఊపి ఊపి చేతులు లాగుతున్నాయి. ఎప్పుడూ నా చుట్టూ అవే మొహాలు చూసిచూసి చిరాకు పుడుతుంది. చెప్పినవే చెప్పీ, వాగిందే వాగి నా గొంతు ఎండిపోతుంది.

ఇంత హడావిడిలో కూడా ప్రతీ శుక్రవారం క్రమం తప్పకుండా మన జడ్జీల పనితీరు పరిశీలించడానికి కోర్టుకు వెళుతూనే ఉన్నాను. అక్కడికీ నా మతానికి వ్యతిరేకంగా పూజలు, పునస్కారాలు, పొర్లుదండాలు, చండీయాగాలు అన్నీ చేస్తున్నా.

అయినా కూడా… పండుగలు, చుట్టాలు, కోళ్ల పందాలు, కొత్త సినిమాల విడుదల, దేశంలో జరుగుతున్న మార్పులు…. వీటన్నిటి హడావిడిలో పడి నన్ను పట్టించుకోవడం మానేశారు మీరు.

అక్కడికీ నన్ను ప్రమోట్ చేస్తారని ఐవైఆర్ లు, ఇలపావులు, కత్తులు లాంటి వారందరినీ పైసలిచ్చి మేపుతున్నా. వారినీ పట్టించుకోరాయె!

ఇది న్యాయమా? ఇది తగునా?

అందుకే… కనీసం నా ఛానెల్ లో అయినా నన్ను చూస్తున్న వారికి నేను అధికారంలోకి వచ్చిన తరువాత కరెంట్ ఫ్రీ, కేబుల్ కనెక్షన్ ఫ్రీ, వారి పిల్ల చదువులకు ఫీజులు ఫ్రీ, వారికీ అయ్యే మందు ఖర్చులు ఫ్రీ, తాగి తాగి జబ్బులు చేస్తే వైద్యం ఫ్రీ, బట్టలు ఫ్రీ, సబ్బులు ఫ్రీ, సంసారానికి అయ్యే ఖర్చులన్నీ ఫ్రీ…. ఇలా అన్నీ ఫ్రీ ఫ్రీ గానే ఇచ్చేస్తానని ఆ దివంగత మహామేత సాక్షిగా చెపుతున్నాను.

ఇప్పటికైనా నన్ను కాస్త పట్టించుకోరూ…. ప్లీజ్!.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*