టీటీడీ ఛైర్మన్ అతనికి ఇస్తే ఉద్యమమే…ఆర్ఎస్ఎస్

ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది అంటే ఇదేనేమో. టీడీపీ ఛైర్మన్ గిరి భర్తీ ఇప్పుడు సి.ఎం చంద్రబాబుకు ఇబ్బందిగా మారనుంది. మంత్రి యనమల వియ్యంకుడు, టీడీపీ నేత సుధాకర్ యాదవ్ కు ఆ పదవిని అప్పగించాలని నిర్ణయించడమే ఇందుకు కారణమంటున్నారు. క్రిస్టియన్ సభలకు వెళ్లి ప్రార్థనలు చేసే అతన్ని ఛైర్మన్ గా ఎన్నుకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు ఆర్ఎస్ఎస్ సిద్దమవుతోంది. అందుకే  చంద్రబాబుకి త్వరలోనే మరో తలనొప్పి ఆరెస్సెస్ రూపంలో రాబోతోందని చెబుతున్నారు. మిత్రపక్షం అయిన బీజేపీతో తోనే తిప్పలు తప్పడం లేదు. మంత్రి మాణిక్యారావు తీరుతో చంద్రబాబుకు కోపం వస్తోంది. అయినా సరే అతన్ని ఏమి అనలేక తమ పార్టీ నేత బాపిరాజు పై నిప్పులు చెరిగారు. ఇప్పుడు బీజేపి కి ఆర్ ఎస్ ఎస్ జత కట్టింది.

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) పాల‌క‌మండ‌లి చైర్మ‌న్ నియామ‌కంలో చంద్ర‌బాబుపై కాషాయ దళం ఒత్తిడి తీసుకువచ్చింది. పాలనా పరంగా వచ్చే నిర్ణయాలని ప్రభావితం చేసేలా వారి ప్లాన్ ఉంటుందట. ఈ విషయంలో బాబు ఒక్క అడుగు ముందుకు వేసినా సరే హస్తిన స్థాయిలో బీజేపి నేతలు స్పందిస్తారట. తమ పార్టీ మంత్రితో రాజీనామా చేయించాల‌నే ఆలోచనకు వారు వచ్చారంటున్నారు. కడపజిల్లాకు చెందిన టీడీపీ నేత సుధాకర్‌ యాదవ్‌ క్రైస్తవ సువార్త కూటముల్లో పాల్గొన్నారు. అందుకే అతన్ని హిందూదేవాలయానికి ఎంపిక చేయవద్దని వాదిస్తున్నారు.

సుధాకర్‌ యాదవ్‌…టీటీడీ గత పాలక మండలిలో సభ్యుడుగా పనిచేశారు. సుధాకర్‌ యాదవ్‌కు టీటీడీ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించడంలో తప్పు లేదు. కానీ తమకు పదవి దక్కలేదనే కారణంతో ఆయన వైరి వర్గం ఆర్ ఎస్ఎస్ తో ఒత్తిడి చేయిస్తుందనేది నిజం. క్రైస్తవ కార్యక్రమాలకు సుధాకర్ ఆర్థిక సాయం చేస్తున్నారు. ఫోటోలు, ప్లెక్సీలు వెలుస్తున్నాయి. సుధాకర్ యాదవ్ అనుమతి లేకుండా వారు చేసే అవకాశం లేదు. అందుకే ఆర్ ఎస్ ఎస్ తప్పు పడుతోంది. అందుకే సుధాకర్ కి చైర్మెన్ పదవి ఇవ్వడం కష్టంగా మారింది.

సుధాకర్ ని నియమిస్తే ఆలయ పవిత్రత దెబ్బ తింటుంద‌ని హిందూత్వ సంస్థలు మండిపడుతున్నాయి. ఆర్‌ఎస్‌ఎస్‌కు ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉన్న భరత్‌ ఏపీ మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. సుధాకర్‌ నియామకంపై సంఘ్‌ తీసుకొన్న నిర్ణయాన్ని మంత్ర‌లకు చెప్పార‌ని తెలుస్తోంది. సుధాకర్ విషయంలో ఆరెస్సెస్ అభ్యంతరాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాలని, నిర్ణయం మార్చుకొనేలా చూడాలని కోరార‌ట. సిఎం చంద్రబాబు ఇందుకు ఒప్పుకోక పోతే ఆర్ఎస్ఎస్ త‌ర‌ఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించారు. అవసరమైతే దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావుతో రాజీనామా కూడా చేయించాలని ఒక వర్గం ప్రతిపాదించింది. ఫలితంగా చంద్రబాబుకి కొత్త సమస్య వచ్చి పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*