వినతి పత్రం ఇస్తే చించేసిన హరీష్ రావు…

తమ సమస్య పరిష్కారమవుతుందనే ఆలోచనతో, ఆశతో బాధితులు నేతలను కలుస్తారు. వినతి పత్రాలు ఇస్తారు. అలానే తెలంగాణ మంత్రి హరీష్ రావు వినతి పత్రం ఇచ్చారు బాధితులు. కానీ ఆయన వారి ముందే ఆ వినతి పత్రాన్న చించేశారు. ఎంత అహంకారం ఉంటే ఇలా చేస్తారంటూ ఆయన పై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. సమస్యను తీర్చకపోయినా ఇలా వారి ముందే చించేసి అవమానించడం మంచి పద్దతి కాదంటున్నారు. 
వరంగల్ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో జరిగింగా సంఘటన. మంత్రి హరీష్‌రావు పర్యటనను అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. రుణమాఫీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై అక్రమాలు చోటు చేసుకున్నాయని మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లారు.ఈ మరేకు వినతిపత్రం ఇస్తే… చించివేసి.. తమను తోసేశారని కాంగ్రెస్‌ పార్టీ రైతు కిసాన్‌ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి దేవేందర్‌రావు చేసిన ఆరోపణ. ఫలితంగా అక్కడ స్వల్ప గందరగోళం నెలకొంది. ఆతర్వాత పోలీసులు కాంగ్రెస్‌ నేతలను పక్కకు తీసుకెళ్లారు.
ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. కేసీఆర్ సర్కారు చెప్పడమే తప్ప..చేసింది తక్కువ. ఇది ప్రజల్లోకి వ్యతిరేకతను తీసుకువచ్చింది. వినతిపత్రం ఇస్తే పట్టించుకోకుండా దౌర్జన్యం ప్రదర్శించడం మరింత విచిత్రం. ఇలాంటి వ్యక్తులకు ప్రజలే బుద్దిచెబుతారని కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు. వరంగల్ రూరల్ పరిధిలో జరిగిన ఇళ్ల నిర్మాణాల విషయంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. వినతి పత్రం ఇస్తే విచారణ జరుపుతామని చెప్పాలి. లేకపోతే తప్పు జరగలేదని ప్రస్తావించాలి. కాంగ్రెస్ నేతలను పోలీసులతో పక్కకు నెట్టించడం, వారి ముందే వినతి పత్రాలను చించేయడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవంగా హరీష్ రావు ప్రజల మనిషిగానే ఉంటారు. కేటీఆర్ కంటే జనాల్లోకి వ్యూహాత్మకంగా వెళతారు. కానీ ఇలా ఎందుకు చేశారనే చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*