వామ్మో శశికళ కలుగులో అన్ని వేల కోట్లా…

తమిళనాడు అన్నా డిఎంకే మాజీ నేత, జైలులో ఉన్న శశికళ కుటుంబ సభ్యులు ఆదాయపన్నును బారీగానే ఎగవేశారు. అందుకే కథ కథలుగా శశికళ గురించి చెప్పుకుంటున్నారు. మన్నార్ గుడి మాఫియా అంటే అదేనేమో. శశికళ కుటుంబ సభ్యులు, బంధువులు అంతా కలిసి ఎగవేసిన ఆదాయపన్ను రూ. 5 వేల  కోట్ల వరకు ఉండవచ్చనట. పోయనేడు నవంబర్ 9న  ఏకకాలంలో పలుచోట్ల ఐటీ సోదాలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 215 ప్రాంతాల్లో ఈ సోదాలు జరగ్గా అందులో చెన్నైలోనే 115 ప్రాంతాలు ఉన్నాయి. ఈ సోదాల్లో రూ.1,450 కోట్ల మేర పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా వారు ఒక అభిప్రాయానికి వచ్చారు.

మాజీ ముఖ్యమంత్రి ,దివంగత నేత జయలలిత నివాసమైన చెన్నై పోయెస్‌ గార్డెన్‌లోని వేద నిలయంలో సోదాలు జరిపారు. అందులో ఉన్న కంప్యూటర్లు, హార్డ్‌ డిస్క్‌లు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 20పైగా డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి వాటిద్వారా రూ.కోట్లలో నగదు బదలాయింపులు చేసినట్లు అర్థమైంది. వాటికి సంబంధించిన ఆధారాలను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జయలలిత ఇంటిలో ఇవన్నీ దొరికాయంటే శశికళ ఒక్కటే తప్పు చేసినట్లా లేకపోతే జయలలిత కూడ ఆ తప్పు చేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జయలలిత విపరీతంగా ఆస్తులు సంపాందించిందంటారు. అలానే ఆమె ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి..ఏంటనే విషయం పై శశికి తప్ప మరెవరికి తెలియదు. మన్నార్ గుడి మాఫియాకు సంబంధించిన కూపీ లాగుతున్నారు ఐటీ అధికారులు. ఫలితంగా మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే వీలుంది.

ఆ సంగతి ఏమో గానీ దొరికిందే గోరంత, దొరకాల్సింది కొండంత అంటున్నారు మరోవైపు డిఎంకే నేతలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*