జైలులో చిప్ప కూడు తినే వారితో మాటలు వద్దట

టీడీపీలో గెలిచి తన పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ లో చేరారు కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి. రాజకీయాల్లో నీతి నిజాయితీ అని మాట్లాడే రేవంత్ రెడ్డికి అవి ఎలాగు లేవని అతని చేతల ద్వారానే అర్థమవుతుందంటారు. నిజమైన నేత అయితే పార్టీకే కాదు..పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ లేఖ అందక పోతే మరో రాజీనామా లేఖను స్పీకర్ కు పంపాలి. అలాంటి వ్యక్తి కేసీఆర్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్ గురించి మాట్లాడారు. అందులో నిజం ఏంటో బహిరంగ చర్చకు రావాలని పట్టుబట్టారు. ఇందుకు బాల్క సుమన్ లాంటి వ్యక్తులు స్పందించారు. రేవంత్ రెడ్డి మాటలకు కేసీఆర్ గానీ..ఆయన కుటుంబ సభ్యులుగానీ పెద్దగా పట్టించుకోరు. పట్టించుకుంటే రేవంత్ రెడ్డి మరింతగా ఎదుగుతాడనేది వారి ఆలోచనట. అంతే కాదు..కేసీఆర్ కుటుంబంలోని చాలా రహస్యాలు రేవంత్ రెడ్డికి తెలిసినట్లుగా మరొకరికి తెలియదంటారు.
 
అందుకే రేవంత్ రెడ్డి ఎంతగా మాట్లాడినా కేసీఆర్ సర్కారు లైట్ తీసుకుంటోంది. ఇప్పుడు కూడ కేటీఆర్ అతని గురించి స్పందించేది లేదంటూనే మాట్లాడారు. జైలులో చిప్పకూడు తినే వారి గురించి పట్టించుకోను అన్నారు. వారి కామెంట్స్ కి మేము స్పందిచవలసిన అవసరం లేదని అన్నారు…వ్యవసాయానికి 24గంటల కరెంట్‌ విజయవంతమవడంతో… కాంగ్రెస్‌ నేతల కడుపు మండుతోందన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ఎంతో బలంగా ఉంది. మరింత బలపడితే ఎక్కడ అధికారంలోకి రాలేం అన్న భయం మాత్రం కాంగ్రెస్ కి ఉందన్నారు కేటీఆర్. కేసీఆర్ పై , ప్రభుత్వం పై ఇష్టమొచ్చినట్టు విమర్శలు చేస్తుంటే ఊరుకునేది లేదని ఆయన మాటల ద్వారా హెచ్చరించినట్లు అయింది. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే న్యాయస్థానాలకి వెళ్ళండి అంటూ సలహా ఇచ్చారు కేటిఆర్. ఫలితంగా ఇప్పుడు మాటల యుద్దం మరింతగా ముదిరే వీలుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*