హైదరాబాద్ కు పాకిన పద్మావత్ సెగ

తెలుగు రాష్ట్రాల్లో హిందూత్వ ప్రచారం చేసే ఏకైక ఎమ్మెల్యే రాజా జయసింగ్. హైదరాబాద్ గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఈయన భాగ్యనగరంలో ఎంఐఎంకు ఎదురొడ్డి నిలుస్తున్నాడు. తన కార్యకలాపాలతో ఒవైసీ  శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నాడు. అందుకే ఐఎస్ఐ వారు రాజాజయసింగ్ ను చంపేస్తామని హెచ్చరించింది. అయినా సరే వెనక్కు తగ్గేది లేదని చెప్పాడు బీజేపీ ఎమ్మెల్యే. ఇంతకు అసలు విషయం ఏంటంటే పద్మావత్ సినిమాకు సెన్సార బోర్డు అనుమతి ఇచ్చినా  ఆయన కాదంటున్నాడు.

ఇప్పుడా సినిమా విడుదలకు బిజెపి ఎమ్మెల్యేలు అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారు. ఉత్తరప్రదశ్ కూడా అనుమతి వచ్చిన ఈ సినిమాను అడ్డుకోవడానికి హైదరాబాద్ లోని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ గట్టి ప్రయత్నం చేస్తున్నాడు. గోషామహల్ నియోజకవర్గంలోని రామకృష్ణ, తారకరామ, స్వప్ప, సంతోష్ , వెంకట రమణ ధియేటర్ల మేనేజర్ల వద్దకు రాజాసింగ్ వెళ్లారు. ఈ సినిమా విడుదల చేయవద్దని కోరారు. తమ మాట వినకుండా సినిమా విడుదలైతే తర్వాత జరిగే పరిణామాలు మా చేతిలో ఉండవని చెప్పారట. ఫలితంగా వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు.

హైదరాబాద్ లో పదిహేను లక్షల మంది కర్నీ రాజపుత్ లు ఉన్నారు. వారు ఈ సినిమాకు నిరసనలు తెలిపే అవకాశం ఉంది. ఈ విషయం పై మాట్లాడేందుకు దియేటర్ల మేనేజర్లు నిరాకరించారు. ప్రభుత్వ అనుమతితో సినిమా విడుదల అయితే తాము రక్షణ కల్పిస్తామని పోలీస్ కమిషనర్ చెప్పినా వారు తటపటాయిస్తున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*