నాయిని, శ్రీనివాస్ గౌడ్ లను పట్టించుకోవద్దట

తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. దీని పై మిశ్రమ స్పందన వస్తోంది. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి భలేగా చెప్పాడు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, హోం మంత్రి నాయిని నరసింహారెడ్డిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వారి సరిగా నేతలే కాదన్న రీతిలో మాట్లాడారు. శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి కేసీఆర్ కు వ్యతిరేకంగా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడనే ప్రచారం లేకపోలేదు. సమయం వచ్చినప్పుడుల్లా కేసీఆర్ సర్కార్ ను తప్పు పట్టేందుకు ప్రయత్నిస్తాడంటున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదనే చర్చా లేకపోలేదు. మరోవైపు  ఫిరాయింపుదారులకు తెలంగాణలో పెద్దపీట వేశారన్న విమర్శలను తేలికగా తీసిపారేశారు గుత్తా. 
వారిద్దరూ చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదనడం ఆసక్తికరంగా మారింది.  ఉద్యమ పార్టీ, రాజకీయ పార్టీకి తేడా ఉంటుందన్నారు. ఆ సంగతి తెలియకు వారు విమర్శిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తెలియక వారు తప్పు పడుతున్నారని ప్రస్తావించారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితుల్లో …అందులోని బలమైన నాయకులను టీఆర్‌ఎస్‌లోకి తీసుకోవడం మంచిదేనని చెప్పారు. సుస్థిరమైన ప‍్రభుత్వం నడపాలనే తీసుకునే నిర్ణయంలో ఇలాంటివి సహజమన‍్నారు. స్థానిక పరిస్థితులు, జిల్లా రాజకీయాలు దృష్టిలో పెట్టుకుని కూడా ఇలాంటి నిర్ణయాలు ఉంటాయని గుత్తా అన్నారు. 
తెలంగాణ అభివృద్ధి కోసమే ఇలాంటి పనులు చేశారన్నారు. దాన్ని భూతద్దంలో చూసి..విమర్శించడం సరికాదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతలే ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేయడం కేసీఆర్ సర్కార్ ను ఇరకాటంలో పెడుతోంది. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు పోరాటం చేసిన వారిని కేసీఆర్ అందలం ఎక్కించారనే విమర్శ ఇబ్బంది కరమే. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ను తమ ఓటుతో ఈడ్చి కొట్టారు అక్కడి జనం. 2014 ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు రాలేదు. అందుకే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని సైతం తీసుకున్నారనేది సీనియర్ల వాదన. ఇప్పుడు నాయిని, శ్రీనివాస్ గౌడ్ లు ఎలా స్పందిస్తారో మరి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*