వెంకన్న సన్నిధిలో నందమూరి, నారా వారి కుటుంబాలు

తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు నందమూరి, నారా వారి కుటుంబ సభ్యులు. ఏపి సి.ఎం చంద్రబాబునాయుడు సొంత ఊరు నారావారిపల్లె. అక్కడ సంక్రాంతి పండుగను జరుపుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, సతీమణి భువనేశ్వరితో పాటు తనయుడు లోకేష్‌, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, సినీ నటుడు నారా రోహిత్‌ కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు.  స్వామి వారిని దర్శించుకున్న తర్వాత రంగనాయకుల మండపానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికారు. శేషవస్త్రంతో సత్కరించారు. తితిదే ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, జేఈవో శ్రీనివాసరాజు కలసి తీర్థ ప్రసాదాలతో పాటు… శ్రీవారి చిత్ర పటాన్ని, నూతన సంవత్సరం క్యాలెండర్‌, డైరీలను అందజేశారు.
రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో… సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఆలయం వద్ద బాలకృష్ణ అభిమానులు జైసింహా అంటూ నినాదాలు చేయగా..వారిని ఆప్యాయంగా పలకించారు నందమూరి అందగాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యులంతా నారావారి పల్లెకు చేరుకున్నారు. అక్కడే పండుగను చేసుకున్నారు. బాలయ్య ఆడపడుచులకు పసుపు, కుంకుమను పంపిణీ చేశారు. స్థానికులతో పోటోలు దిగిన బాలయ్య సందడి చేశారు. మరోవైపు సి.ఎం చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా వేడుకలను జరుపుకున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*