మోడీ నుంచి గట్టి హామీ రాలేదట…

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు 45 నిమిషాలపాటు సమావేశమయ్యారు. బయటకు వచ్చాక అంత హూషారు గా కనపించలేదు చంద్రబాబు. ఎప్పటిలానే మీడియాతో మాట్లాడినా గతంలో ఉన్న ఉత్సాహం కనపడలేదు. ఫలితంగా పోలవరం పై అనుకున్న రీతిలో సానుకూల స్పందన రాలేదంటున్నారు. ఏపీ అభివృద్ధికి, చంద్రబాబుకు ముకుతాడు వేసే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారంటున్నారు. చానాళ్ల తర్వాత అపాయింట్ మెంట్ ఇచ్చినా…చెప్పడం వరకే చంద్రబాబు చేశారట. ఇందుకు అటునుంచి చేస్తామని చెప్పడం తప్ప గట్టి హామీ ఏది రాలేదంటున్నారు.

ఒక రాష్ట్ర సి.ఎం అపాయింట్ మెంట్ అడిగితే కాదంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో ఎంపీలు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ప్రధానిని కోరారు. ఫలితంగా చంద్రబాబును కలుస్తానని చెప్పారు మోడీ. ఇప్పుడు విపక్షం వారిద్దరి మధ్య జరిగిన అంశాలను బయట పెట్టాలని కోరుతోంది. వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ అదే డిమాండ్‌ చేశారు. 20 అంశాలను మోదీ దృష్టికి తీసుకెళ్లినట్లు చంద్రబాబు మీడియాతో చెప్పారు. అవన్నీ నాలుగేళ్లుగా అడుగుతున్నవేనని గుర్తుచేశారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగరాజపట్నం పోర్టు, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వంటి పాత అంశాలే తప్ప కొత్తగా అడిగిందేమీ లేదనేది వైకాపా విమర్శ.

మోదీ వేటికి ఆమోదం తెలిపారో కూడా చంద్రబాబు చెప్పలేదన్నారు. దేశంలో అందరి కంటే సీనియర్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు. అందులో తిరుగేలేదు. కానీ చంద్రబాబుకు నాలుగేళ్లుగా కేంద్రం నుంచి అనుకున్నంత మేర సాయం లభించడంలేదు. ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం రూ.1.20 లక్షల కోట్ల అప్పులు చేసింది. సాగునీటి ప్రాజెక్టులపై రూ.16 వేల కోట్లు ఖర్చు చేసింది. దుగరాజపట్నం పోర్టుకు బదులుగా రెండు ఎకనామిక్‌ జోన్లు ఇవ్వాలని చంద్రబాబు కోరారు. మొత్తంగా ఏపీని అభివృద్ధి పథంలో నిలిపే ఆలోచన చేస్తున్నారు. కానీ కేంద్రం ఇందుకు సహకరిస్తుందా లేదా అనే అనుమానం వస్తోంది.

పవన్ తో కలిసి వెళ్లాలా..లేక బీజేపీతోనే సాగితే మంచిదా అనే సందిగ్దంలో చంద్రబాబు పడ్డారంటున్నారు. అందుకే బీజేపీతో ఇప్పుడు కాకపోయినా ఎన్నికలక ముందు తెగదెంపులు చేసుకునే ఆలోచన చేస్తున్నారట బాబు. అలా చేస్తే తనకు పార్టీకి మైలేజ్ వస్తుందని చూస్తున్నారట. మరోవైపు పవన్ కల్యాణ్ కు ఎంతో కొంత అభిమానులు ఉన్నారు కాబట్టి ఓట్లు వేసే వీలుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*