విజనరీ లీడర్ చంద్రబాబు అన్న కుంబ్లే….

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే. బౌలింగ్ తో ప్రపంచ రికార్డులను క్రియేట్ చేసిన వ్యక్తి. భారత రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. పొరుగు రాష్ట్రం కర్నాకటకు చెందిన వ్యక్తే కాబట్టి ఆంధ్రప్రదేశ్ గురించి కొద్దిగా అవగాహన ఉంది.  కానీ ఆయన ఎవరు మంచి పరిపాలకులో బాగా తెలుసుకున్నట్లున్నాడు. ఆంధ్రప్రదేశ్ సి.ఎం చంద్రబాబు గురించి ప్రస్తావించాడు. విజయవాడలోని మేరీ స్టెల్లా కాలేజీలో జరిగిన జాతీయ యువజనోత్సవాల్లో పాల్గొన్న సందర్భంలో మాట్లాడారాయన. అందరికీ నమస్కారం” అని తెలుగులోనే మొదలు పెట్టి తనకు తెలిసిన కొద్ద పదాలను చెప్పాడు. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు డైనమిక్‌, విజనరీ లీడర్ అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడల అభివృద్ధికి ఆయన కృషి చేస్తున్నారని అనిల్ కుంబ్లే ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాకు ఈ సమావేశంలో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు సంతోషం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన స్పోర్ట్స్ పాలసీ బాగుందని కితాబునిచ్చాడాయన. క్రీడారంగానికి నిధులు కేటాయించడమే కాదు..ఆటగాళ్లను ప్రొత్సహించే విషయంలో ఏపీ ముందుందని చెప్పారు

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*