కేసీఆర్ కు ఝలక్ ఇచ్చిన గవర్నర్

ఇంటా బయట గవర్నర్ నరసింహన్ పనితీరు పై దుమారం రేగింది. ఇటీవల హస్తినకు వెళ్లి వచ్చిన గవర్నర్ కు కమలం పెద్దలు సెగ తగిలించారట. మీరు టీఆర్ఎస్ కార్యకర్తలా పని చేస్తున్నారని..ఇది మంచి పద్దతి కాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీ బీజేపీ నేతలు అదే మాట చెప్పారు. ఫలితంగా గవర్నర్ తీరు వివాదస్పదమైంది. ఉంటే పద్దతిగా ఉండు. లేకపోతే పదవి ఊడుతుందని చెప్పారట.. అందుకే గవర్నర్ ఇప్పుడు కేసీఆర్ పై మండిపడుతున్నారని తెలుస్తోంది.
గవర్నర్ నరసింహన్ కేసీఆర్ కు ఊహించని విధంగా షాక్ ఇచ్చారని సమాచారం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఇసుక మాఫియా అంశాన్ని కాంగ్రెస్ నేతలు గవర్నర్ నరసింహన్ దృష్టికి తీసుకెళ్లారు. పద్దతి గలవాడు అయితే ఏం చెప్పాలి. విచారణ జరిపిస్తాం. తప్పు చేసిన వారి పై చర్యలు తీసుకుంటామని చెప్పాలి. కానీ మీ ప్రభుత్వ కాలంలో ఇవి జరగలేదా అని గవర్నర్ ప్రశ్నించడంతో కాంగ్రెస్ నేతలు మూకుమ్మడిగా ఆయన పై మండి పడ్డారు. 
తెలంగాణ ప్రభుత్వ కాలంలో తప్పు జరగలేదని చెప్పే ప్రయత్నంలో తాను ఇరుక్కున్నానన్న సంగతి నరసింహన్ కు తర్వాతగానీ తెలియలేదు. అదే సమయంలో ఏపీ నాలా బిల్లును ఆమోదించకుండా తిప్పి పంపడంతో ఇంకాస్త దుమారం రేగింది. తెలంగాణ బిల్లును ఆమోదించి..ఏపీ బిల్లును ఆపడంతో గవర్నర్ నా..టీఆర్ఎస్ కార్యకర్తనా అనే చర్చ సాగింది. 
ఇవే విషయాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర గవర్నర్ ప్రస్తావించారట. ఇసుక మాఫియా పై నాకు నివేదిక ఇవ్వాలని గవర్నర్ కోరారట. అక్కడ విఆర్వో చనిపోయారు కదా అని అడిగారట. చనిపోయింది వీఆర్ఏ కాదని కేసీఆర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా… గవర్నర్ మాత్రం ఆయన మాట వినలేదట. సాధ్యమైనంత తొందరగా తనకు సమగ్రమైన నివేదిక ఇవ్వాలని ఆయన కేసీఆర్ ను కోరినట్టు టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గవర్నర్ తో సమావేశమై వచ్చిన తరువాత కేసీఆర్ దీనిపై నివేదిక ఇవ్వాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు పంపించారని తెలుస్తోంది. గతంలో ఎప్పుడూ ఇంత గట్టిగా సీఎం కేసీఆర్ ను గవర్నర్ నిలదీయలేదట. 
మొత్తం మీద  ఇసుక మాఫియాపై కేసీఆర్ ను నిలదీయడం హాట్ టాపికైంది. గవర్నర్ వైఖరి మారక పోతే తన పదవికి ఎసరు వస్తుందని భయపడే నివేదిక అడిగారంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*