పాదయాత్ర జగన్ ది.. ప్లస్ మార్కులు చంద్రబాబుకి!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడొక చిత్రమైన కష్టం వస్తోంది. ఆ పార్టీ అధినేత వైఎస జగన్మోహన్ రెడ్డి చాలా కష్టపడి పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ఆయన పాపం.. ఆరున్నర కిలోల బరువు కూడా తగ్గిపోయారు. కానీ అలుపెరగకుండా యాత్ర సాగుతోంది. అయితే ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో రేకెత్తుతున్న సందేహం ఏంటంటే.. ఇంత కష్టపడి నాయకుడు నడుస్తున్నాడు గానీ.. దానివలన తగిన ప్రయోజనం తమకు కలుగుతోందా లేదా? అని! ఎందుకంటే.. జగన్ పాదయాత్ర సాగుతూ వెళ్తుండగా.. ఎక్కడో తాము పోగేసిన జనంతో మాట్లాడేప్పుడు.. పనిగట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం లో కష్టాలు పడుతున్నట్లుగా వారితో చెప్పించడం జరుగుతోంది. అది తమ మీడియా ద్వారానే ప్రచారంలోకి తీసుకెళ్లడం కూడా జరుగుతోంది. కానీ.. యాత్రలో భాగంగా నడుస్తున్నప్పుడు.. ఎక్కడైనా అనుకోకుండా.. రోడ్డు పక్కన కనిపించే ప్రజల్లో జగన్ ఇంటరాక్ట్ అయినప్పుడు… వారు చెబుతున్న విషయాల వల్ల చంద్రబాబునాయుడుకే మార్కులు పడుతున్నట్లుగా ఉన్నదని వైకాపా శ్రేణులు భావిస్తున్నాయి. పాదయాత్ర కష్టం తాము పడుతోంటే.. ప్రజలు చెబుతునన విషయాలు చంద్రబాబు సర్కారు అద్భుతంగా చేస్తున్నదనే ఇంప్రెషన్ కలిగించేలా ఉన్నాయని వారు మధనపడిపోతునారు.

ఫరెగ్జాంపుల్.. ప్రస్తుతం జగన్ చిత్తూరు జిల్లాలో తిరుగుతున్నారు. మొన్నటికి మొన్న ఆయన నడుస్తూ నడుస్తూ.. రోడ్డు పక్కనే వరినాట్లు వేసుకునే యంత్రంతో పనిచేసుకుంటున్న ఓ రైతుతో పిచ్చాపాటీ ప్రారంభించారు. ఆ యంత్రంతో జగన్ కూడా కాసేపు నాట్లు వేశారు. ఆ ఫోటో ప్రముఖంగా పత్రికల్లో వచ్చింది. అది వేరే సంగతి. అయితే ఆ రైతు చెప్పిన మాటలే వైకాపా వారికి బోధ పడడం లేదు. వరి నాట్లు వేసే యంత్రానికి ఎంత ఖర్చవుతుంది.. ప్రభుత్వం ఏమైనా సాయం చేసిందా లేదా అని జగన్ అడిగారు. జగన్ అడిగారు గనుక.. ప్రభుత్వం విమర్శను వారు ఆశించారు. కానీ అలా జరగలేదు.

వరి నాట్లు యంత్రానికి 16 లక్షలు అవుతుందని 8 లక్షలు ప్రభుత్వమే సబ్సిడీగా సమకూర్చిందని రైతు చెప్పారు. ప్రభుత్వానికి థాంక్స్ చెప్పడం తప్ప నిందించడానికి పాయింట్ ఏమీ దొరక్కపోవడంతో జగన్ బ్యాచ్ ఖంగు తిన్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*