24 గంటల కరెంట్ పై టీఆర్ఎస్ నేతల చెరో మాట

తెలంగాణలో రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇవ్వొద్దని ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. అలా రోజంతా కరెంట్ ఇస్తే బోర్లు, బావులు ఎండిపోయే ప్రమాదముంది. అందుకే 12 గంటల కరెంట్‌ చాలు అని ఆయన మంత్రి హరీష్ రావు సమక్షంలోనే చెప్పారు. ఇందుకు హరీష్ రావు  తగ్గలేదు. మీకు ఎన్ని గంటలు కావాలంటే అన్ని గంటలు విద్యుత్‌ ఇస్తాం. గ్రామ పంచాయతీ తీర్మానం చేసి పంపిస్తే పరిశీలిస్తాం అని సమాధానం ఇచ్చారు. హైటెక్‌ సిటీలో ఎంత నాణ్యమైన కరెంట్‌ ఉందో అదే కరెంట్‌ గ్రామాలకూ వస్తుందన్నారు. ‘తెలంగాణ ఏర్పాటైతే రాష్ట్రం చీకటిగా మారుతుందని కాంగ్రెస్‌ వాళ్లు అన్నారు. కానీ, నేడు సాగుకు 24 గంటల నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నామని హరీష్ రావు చెప్పే ప్రయత్నం చేశారు.

24 గంటల విద్యుత్ ఇచ్చే విషయం పై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సవాల్ చేసింది. ఇందుకు ఎంపీ బాల్క సుమన్ ధీటుగానే బదులిచ్చారు. తీరా అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నేతలు వేచి ఉన్నా…తోక ముడిచినట్లు తప్పుకున్నాడు బాల్క సుమన్. విద్యుత్ పై మాట్లాడే ధైర్యం లేకనే అతను వెనక్కు తగ్గాడంటున్నారు. ఏదో రాజకీయాల కోసం సవాల్ అంటాం. అంత మాత్రాన వస్తామా ఏంటి..అని ప్రశ్నించారు.

ఇక్కడే కాదు..మొన్నీ మధ్య అంబటి రాంబాబు, బుద్దా వెంకన్న మధ్య ఇలానే సవాళ్లు నడిచాయి. తెగేదాక లాగడం ఎందుకనే ఆలోచనతో పోలీసుల అంబటిని ఇంట్లోనే నిర్భంధించగా…బుద్దా వెంకన్న స్వేచ్ఛగా అలా ఒక సారి తిరిగొచ్చారు. అదండీ సంగతి. ఊరికే సవాళ్లు విసురుకోవడం గానీ..నిజంగా నిలిచి నిలుపుకునే వారు తక్కువే అని చెప్పాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*