బాపిరాజును హెచ్చరించిన చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, బీజేపీ నేతల మధ్య ఉన్న వివాదం పై సి.ఎం చంద్రబాబు ఆరా తీశారు. దీని పై అసలు ఏం జరుగుతుందో కనుక్కుని తనకు నివేదిక ఇవ్వాలని కోరారు. ఈ మేరకు జడ్పీ చైర్మన్ బాపిరాజు, ఇతర టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన సీరియస్ అయ్యారు.  మంత్రులు పత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర, పిఠాపురం ఎమ్మెల్యే వర్మతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు.  పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని వారిని హెచ్చరించారు. బాపిరాజుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
నాకు.. నా ఊరికి.. నా నియోజకవర్గానికి వచ్చే నిధుల్ని.. నా ద్వారా చేసే పనులను నువ్వు ఆపడానికి ప్రయత్నిస్తే నేను మగాడినో.. కాదో తేల్చుకుంటా’ అని బాపిరాజు ను ఉద్దేశించి మంత్రి మాణిక్యాలరావు అన్న సంగతి తెలిసిందే. ‘మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా నన్ను పిలిచారా? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నేను వైసీపీ నుంచి వచ్చానా? ఊళ్లో ఏదైనా రోడ్డు వేసి.. నా రోడ్డుపై నడవద్దంటే ఎదుటివాడు వచ్చి తంతాడు. ఎవరెవరికైనా ఓటు వేసుకోవచ్చు..’ అంటూ మంత్రి మాణిక్యాలరావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. తనను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. చాలా స్పష్టంగా చెబుతున్నా, సహనానికి హద్దులు ఉంటాయి అని మాణిక్యాలరావు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఇది బీజేపీ, టీడీపీ సంబంధాలను ప్రభావితం చేసింది. పార్టీ హైకమాండ్ కు ఈ విషయాన్ని పంపారు అనుచరులు. ఫలితంగా ఢిల్లీ స్థాయిలో టీడీపీ నేతలు చేస్తున్న పనుల పై ఆరా తీశారని తెలుస్తోంది.
అలా మాట్లాడిన మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను తెలుగుదేశం నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం ఖంచింది. దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరింది. మీకు ఆ ధైర్యం ఉందా అని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ హెచ్చరించారు.
 
ఈ మొత్తం విషయం చంద్రబాబుకు చికాకు తెప్పించింది. అందుకే అసలు ఏం జరిగిందో ఆరా తీసి వీలున్నంత తొందరగా తనకు నివేదిక ఇవ్వాలని సిఎం కోరడం హాట్ టాపికైంది.
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*