వివేక్ అక్రమాలు చేస్తున్నాడన్న అజహరుద్దీన్…

కుక్క పని కుక్క చేయాలి. గాడిద పని గాడిద చేయాలి. కానీ ఎవరు ఏ పని చేయకపోయినా మిగతా వారికి ఇబ్బందే. ఇప్పుడు క్రికెట్ విషయంలో వివేక్ చేసే పని ఈ సామెతను గుర్తుకు తెస్తోంది. భారత మాజీ క్రికెట్ కెప్టెన్ అజహరుద్దీన్ ను ఆయన అవమానించిన సంగతి తెలిసిందే. అధికారం ఉందనే అహంకారంతో ఆయన వ్యవహరిస్తున్నాడనే విమర్శలున్నాయి. ఊసరవెల్లి సిగ్గుపడేలా..పార్టీలు మార్చాడు వివేక్. కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ కు వెళ్లాడు. అక్కడ సరిగా లేదు. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్  అధికారంలోకి వస్తుందనే చర్చ సాగింది. అంతే ఇక లాభం లేదని…టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు వచ్చాడు. అక్కడన్నా సరిగా ఉన్నాడా అంటే అదీ లేదు. అధికారం లేదు. అందుకే మరోసారి టీఆర్ఎస్ కు వెళ్లాడు. జి వెంకటస్వామి పరువు తీసేలా వ్యవహరించాడు వివేక్. 
ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు దిక్కుతోచడం లేదు. దొడ్డిదారిన తనకు ఎదురు లేకుండా చేసుకుని హెచ్ సిఏ అధ్యక్ష పీఠం పై ఆయన కూర్చున్నాడనే విమర్శలున్నాయి. ఇప్పుడు ఆయన అజార్ కు క్రికెట్ లో ఓనమాలు నేర్పుతున్నాడు. గుడ్డు వచ్చి పిల్లను ఎక్కిరించిందట. అలా ఉంది వివేక్ తీరు. ఆయన అజహరుద్దీన్ కు చెబితే క్రికెట్ లో నిబంధనలు, ఆట తెలుసుకోవాలట. అదండీ సంగతి. 
అందుకే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తనపై చేస్తోన్న విమర్శలను భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఘాటుగా తిప్పికొట్టారు. హెచ్‌సిఏ ప్రెసిడెంట్ వివేక్‌కు ఏమాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేదని నిప్పులు చెరిగారు.  లోథా కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా హెచ్‌సిఏ అందరినీ మోసం చేస్తోందని అజార్ ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారునిగా ఉంటూ హెచ్‌సిఏ ప్రెసిడెంట్‌గా వివేక్ ఎలా కొనసాగుతారని ప్రశ్నించారాయన.
 తనపై నిషేధం విషయంలో హైకోర్ట్ క్లియరెన్స్ ఇచ్చిందని, దీనిపై బీసిసిఐకి కూడా లేఖ రాసినట్టు వెల్లడించారు. క్రికెటర్‌గా హైదరాబాద్ నుంచే తాను దేశానికి ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేశారు. జిల్లాలో టాలెంట్ ఉన్న క్రికెటర్లను హెచ్‌సిఏ పట్టుంచుకోవడం లేదని, సెలక్టర్లపై ఒత్తిడి తెచ్చి టాలెంట్ లేని ఆటగాళ్ళను ఎంపిక చేస్తున్నారని అజహర్ చెప్పారు. ఫలితంగా వివేక్ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఇలాంటి పనులు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తన తప్పు తెలుసుకోగ పోగా..ఇంకా అజహార్ మీద మీడియా ముందుకు వచ్చి మరీ విమర్శలు గుప్పించడం మరింత విచిత్రం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*