16 ఐటీ కంపెనీలను ప్రారంభించనున్న లోకేష్

ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఆంధ్రుల నగరి అమరావతి రాజధానిలో ఇప్పుడు మరో 16 ఐటీ అండ్ ఐటీఇఎస్ కంపెనీలు ప్రారంభం కానున్నాయి. గుంటూరుజిల్లా మంగళగిరిలో ఏర్పాటు కానున్న ఈ కంపెనీలను ఏపీ పంచాయితీ రాజ్ అండ్ రూరల్ డెవలప్ మెంట్, మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈనెల 17న ప్రారంభించనున్నారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి రావాల్సిందిగా ఏపి ఎన్ ఆర్టీ, ఎపిఇఐటిఎలు సంయుక్తంగా ఆహ్వానించాయి.

మేక్ మై క్లినిక్, ఆల్పా ఐటీ, పిక్సీ, ఆడ్ వెయిట్, చార్వీకెంట్, సిగ్నమ్, సట్వికా, బివిజీ, సువిజ్, మాతృ మీడియా, సన్ సెట్ ఎల్ ఎల్ సి, క్రేజీ టూన్జ్, డేటా ఫస్ట్, స్కృిప్ట్ బీస్, స్వారా సాప్ట్ కన్ సల్ టెంట్ ప్రెవేట్ లిమిటెడ్, ఎక్స్ ఎల్ ఇన్ పో సర్వీసెస్, డిజిటల్ లింక్ వంటి సంస్థలు తమ కార్యాలయాలను అక్కడ ప్రారంభించనున్నాయి. మంత్రి నారా లోకేష్ ఆయా కంపెనీలను ప్రారంభించనుండటం అభినందనీయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*