తిరుపతిలో జోహో కంపెనీ, సేవలను ప్రారంభించిన చంద్రబాబు

అమెరికాలోని కాలిఫోర్నియా బేస్డ్ కంపెనీ జోహో. తిరుపతిలో తన కార్యకలాపాలను ప్రారంభించింది. సి.ఎం చంద్రబాబుబనాయుడు జోహో కంపెనీ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పనిచేసే ఈ సంస్థ ద్వారా 5 వేల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. జోహో కంపెనీ క్లౌడ్ ఇఆర్పీ సర్వీసెస్ లో మంచి పేరు ఉన్న కంపెనీ.  జోహో తిరుపతిలో తమ అభివృద్ధి కేంద్రాన్ని నెలకొల్పడం విశేషం. మంత్రి నారా లోకేష్ ఇటీవల అమెరికాకు వెళ్లినప్పుడు ఆ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇప్పటికే గూగుల్ ఎక్స్ కంపెనీని విశాఖపట్నం వచ్చేందుకు ఒప్పించిన నారా లోకేష్‌ మరో ప్రతిష్టాత్మక కంపెనీని తీసుకురావడంలో సఫలం అయ్యారు. 
శాన్ ఫ్రాన్సిస్కోలోని హిటాచి కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఓట్సుకి తోను మంత్రి నారా లోకేశ్‌ గతంలో మాట్లాడారు. ఏపిలో సోషల్ ఇన్నోవేషన్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని  హిటాచి కంపెనీ రానుంది. తిరుపతి-రేణిగుంట రోడ్డులో జోహో సాఫ్ట్‌వేర్‌ కంపెనీని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించడంతో కొత్త శకం ప్రారంభమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఐటీ కంపెనీ ఎక్కడ కట్టాలి అని ఆలోచించి చివరకు హైదరాబాద్‌లో సైబర్‌ టవర్స్‌ కట్టారు చంద్రబాబు. 
ఆ తర్వాత మైక్రోసాఫ్ట్‌ కంపెనీని తెప్పించారు. తిరుపతిని ఐటీ పరిశ్రమల హబ్‌గా తీర్చిదిద్దుతుతున్నారు. చెన్నై, బెంగళూరుకు సమీపంలో ఆ వెంకన్న సన్నిధిలో ఐటీ పరిశ్రమలు రావడం మంచి వార్తనే. ప్రపంచంలోని నలుగురు ఐటీ భారతీయుల్లో ఒకరు ఏపీ వారు ఉన్న సంగతి తెలిసిందే. భవిష్యత్‌ అంతా నాలెడ్జి ఎకానమీదేనని, తిరుపతిలో ఎస్వీయు, ఐఐటి, ఐసర్‌ లాంటి ఉండడం వల్ల తిరుపతి నాలెడ్జి హబ్‌గా అభివృద్ధి అవుతుందని ఈ సందర్భంగా తెలిపారు చంద్రబాబు. అమెరికాలో సిలికాన్‌ వ్యాలీలా విశాఖ నుండి అనంతపురం వరకు ఆంధ్రా వ్యాలీగా అభివృద్ధి చెందనుంది. తిరుపతి స్థానిక యూనివర్సిటీల నుంచి ఉద్యోగాల కోసం ఎంపిక చేయనున్నారు. 
తిరుపతిలో సెల్‌కాన్‌, కార్బన్‌, డిక్సన్‌ లాంటి కంపెనీలు ఈఎంసీ 1లో వచ్చాయి. జోహో కంపెనీకి తిరుపతి అతిపెద్ద సెంటర్‌ కానుంది. వచ్చే మార్చి నెల లోపు 100 శాతం పేపర్‌ లెస్‌ ఆఫీసును ఇందుకు సిద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక కోటి మందిని ఐటీ శాఖ ద్వారా డిజిటల్‌ లిటరేట్స్‌ చేస్తామని, ప్రపంచంలో అతి తక్కువ ఖర్చు నెలకు రూ.149 తో ఇంటింటికీ ఇంటర్నెట్‌, టివిని ఏపీ ఫైబర్‌ నెట్‌ ద్వారా ఇప్పటికే ఇస్తుంది ఏపీ ప్రభుత్వం. 
జోహో సీఈఓ శ్రీధర్‌ సిఎం చంద్రబాబు తీరును మెచ్చుకున్నారు. విశాఖ, అమరావతి, తిరుపతి, అనంతపురంలను ఐటీ హబ్‌ లుగా తీర్చిదిద్దుతున్న చంద్రబాబు లాంటి వ్యక్తి ఏపీకి దొరకడం శుభ కరమన్నారు. ప్రతి జిల్లాలో ఒక ఐటీ టవర్‌ కట్టాలని జోహో కంపెనీకి సూచించారు 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*