తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారా…

తెలంగాణ హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతారు. కొన్ని సార్లు అవే చిక్కులు తెచ్చిపెడతాయి. తెలంగాణ ద్రోహులు మంత్రి వర్గంలో ఉన్నారని నాయిని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మంత్రి తలసాని, తుమ్మల నాగేశ్వరరావులు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారు. సమైక్య రాష్ట్రం ఉండాలని కోరుకున్నారు. బాహాటంగానే వారీ మాట చెప్పారు. కానీ వారిని తమ పార్టీలోకి తీసుకోవడమే కాదు…మంత్రి వర్గంలోను పెట్టుకున్న సిఎం కేసీఆర్. వారే కాదు..మరికొందరినీ మంత్రి వర్గంలోకి తీసుకోవడం వివాదాలకు తావిచ్చింది. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా తాను చెప్పదల్చుకున్న విషయాన్ని చెప్పేశాడు నాయిని. 
అవును నాయిని చెప్పింది నిజమే. మేము మొదటి నుంచి అదే చెబుతున్నామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ లాంటి వారు సమర్థించారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కొత్తకోటలో జరిగిన సభలోను ఇదే మాట ప్రస్తావించారు. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన వారిని మంత్రి వర్గంలోకి తీసుకుని పోరాటం చేసిన వారికి అన్యాయం చేసారని చెప్పారాయన. కేసీఆర్ కు వెన్నంటి ఉన్నాడు నాయిని. ఉద్యమ సమయంలో చాలా అండదండలందించారు. అలాంటి వ్యక్తి చెప్పిన మాటలు నిజమే అయినా..రాజకీయ పునరేకీకరణ, గెలుపు కావాలంటే వారిని చేర్చుకోక తప్పలేదనేది సీనియర్ల మాటగా ఉంది. అందుకే మిగతా వారు ఏం మాట్లాడలేక పోతున్నారట.   

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*