జడ్జిలు ఎందుకు ఎదురు తిరిగారంటే

సుప్రిీంకోర్టు జడ్జిల తిరుగుబాటు మాములు విషయం కాదు. చాలా కారణాలు ఉన్నా..అందులో ఒకటి బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కేసు అంటున్నారు. షోహ్రబుద్దీన్ ను గుజరాత్ పోలీసులు బూటకపు ఎన్ కౌంటర్ చేశారనేది వచ్చిన ఆరోపణ. ఇందుకు గాను కమలం పెద్ద అమిత్ షా జైలుకు వెళ్లవలసి వచ్చింది. ఆ తర్వాత ఈ కేసు విచారణ చేసిన ముంబై జడ్జి లోయా అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. వారంరోజుల తర్వాత గానీ కుటుంబ సభ్యులకు ఆ సంగతి తెలియలేదు. కుటుంబ సభ్యులకు తెలియకుండానే అంత్యక్రియలు జరిగాయనే వాదనుంది. అంతే కాదు..ఆయన గుండెపోటుతో చనిపోయారని చెబుతున్నా…వంటి పై రక్తపు గాయాలున్నాయి. దీనిపై విచారణ చేసేందుకు హైకోర్టు ఒప్పుకోలేదు. 
కార్వాన్ అనే పత్రికలో ఈ జడ్జి మరణంపై ఆసక్తికర కథనం వచ్చింది. దాని ఆదారంగా మళ్లీ విచారణకు పిటిషన్ లు దాఖలైంది. అప్పుడు గానీ ముంబై హైకోర్టు విచారణకు సిద్దమైంది.ఇక ఈ కేసు వ్యవహారం సుప్రీంకోర్టుకు వచ్చింది. ఛీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం ఖాన్విల్కర్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఈ కేసును పరిశీలించింది. ఆ తర్వాత ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఎం శంతనగౌదార్‌లతో కూడిన బెంచ్‌కు ఈ కేసును కేటాయించడం వివాదాస్పదం అయింది. ఇది సీనియర్‌ జడ్జీలకు కోపం తెప్పించింది. 
రాజకీయ కేసులను తాము విచారించకుండా ఎందుకు తప్పించారో చెప్పాలని జస్టిస్‌ చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్‌ ప్రభృతులు ఛీఫ్‌ జస్టిస్‌ ను ప్రశ్నించారని తెలుస్తోంది. ప్రధాన న్యాయమూర్తి ఇందుకు సరైన సమాధానం చెప్పలేక పోవడంతో ఉత్కంఠ నెలకుంది. ఆ తర్వాత జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇంట్లో ఈ నలుగురు జడ్జీలు మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేసారు. ఎందుకు తాము అసంతృప్తి వ్యక్తం చేశామనేది చెప్పకుండా తమ వాదవ వినిపించారు. బీజేపీ సర్కార్ కావాలని ఆ కేసు విషయంలోనే కాదు..మరికొన్నింటి విషయంలో సీనియర్లను కాదంటుందనే అభిప్రాయం వస్తోంది. 
ఇలా మూకుమ్మడిగా జడ్జిలు ఎదురు తిరగడం మాములు విషయం కాదు. 
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*