సంక్రాంతి….కి చంద్రబాబు, జగన్ లు ఎక్కడ ఉంటారంటే…

సంక్రాంతి పండగతో పల్లెసీమలు సందడిగా మారాయి. భాగ్యనగరం సగం ఖాళీ అయింది. రోడ్లన్నీ విశాలంగా కనపడుతున్నాయి. జనాలే లేరు. రోజు మనం చూసే ఊరు ఇదేనా అనిపిస్తోంది. సొంత గ్రామాలకు ప్రజలు తరలి పోవడమే ఇందుకు కారణం. కుటుంబాల్లో ఉన్న ఆత్మీయతలు, అనుబంధాలు కనపడుతున్నాయి. రైతులు, పల్లెలు ప్రతి ఒక‍్కరికీ గుర్తుకు వస్తాయి. భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటల, గాలి పటాల సందళ్లు, పైరు పచ్చల కళకళలు సంక్రాంతి పేరు చెబితేనే ఇవన్నీ గుర్తుకు వస్తాయి. అన్నపూర్ణగా పేరుగాంచిన తెలుగు నేల మీద రైతన్నలు, గ్రామీణ వృత్తులవారు సుఖ, సంతోషాలతో తులతూగాలని ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

నారావారి పల్లెలో…

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లె ముస్తాబవుతోంది. నారా, నందమూరి కుటుంబాలు మూడ్రోజులపాటు సొంతూర్లోనే పండగ జరుపుకోనున్నాయి. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నారావారిపల్లెకు చేరుకున్నారు. చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబ సభ్యులు రానున్నారు. సీఎం పర్యటన సందర్భంగా గ్రామంలో పటిష్టమైన భద్రత కల్పించారు. నారావారిపల్లెలో వంద పడకల ఆస్పత్రితో పాటు టీటీడీ కల్యాణ మండపాన్ని సీఎం ప్రారంభించనున్నారు. సరదాగా కుటుంబ సభ్యులతో ఆయన గడపనున్నారు.

చంద్రగిరిలో జగన్…

మరోవైపు పాదయాత్రలో ఉన్న విపక్ష పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి..ఈ సారి చిత్తూరు జిల్లాలోనే సంక్రాంతి పండుగను జరుపుకోనున్నారు. ప్రస్తుతం ఆయన 60 రోజుల పాదయాత్రను పూర్తి చేసుకున్నాడు. చంద్రబాబు తొలిసారిగా పోటీ చేసి గెలిచినా..ఓడినా నియోజకవర్గం చంద్రగరిలో జగన్ సంక్రాంతి సంబరాలు చేసుకోనున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు అక్కడ గెలిచిన సంగతి తెలిసిందే. తన కుటుంబ సభ్యులతో జగన్ అక్కడే పండుగ చేసుకోనున్నారు. ఇక తెలంగాణలో దసరాకు ఇచ్చినంత ప్రయార్టీ సంక్రాంతికి ఇవ్వరు. రాయలసీమలోను కొన్ని చోట్ల సంక్రాంతిని లైట్ తీసుకుంటారు. కానీ ఆంద్రప్రదేశ్ కు పెద్ద పండుగ అంటే సంక్రాంతిగానే భావిస్తారు. అందుకే అందరూ కలిసి ఆత్మీయంగా ఈ పండుగ చేసుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*