రజనీకి పెరుగుతున్న మద్దతు

సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ ఏర్పాటు ప్రకటనతో తమిళనాట కలకలం రేగుతున్నసంగతి తెలిసిందే. రజని రాజకీయ ప్రవేశం పై కమల్ హాన్  స్వాగతించగా… లారెన్స్, విశాల్, రాధికా శరత్ బాబు వంటి వారు రజనీకాంత్ కు తమ మద్దతు తెలిపారు. తాజాగా ప్రముఖ దర్శకుడు సి. సుందర్ కూడా రజని కే తన మద్దతు తెలిపారు. సి. సుందర్ రజని కాంత్, కమల్ హాసన్ లతో పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సి. సుందర్ నటి క్రాంగ్రెస్ పార్టీ ప్రచార ప్రతినిధి కుష్బూ భర్త. కోలీవుడ్ లో మంచి దర్శకుడు, నిర్మాత. రజనీకాంత్ కి పెరుగుతున్న సినీ ప్రముఖుల మద్దతు తో తమిళ రాజకీయాల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
డిఎంకే తో కలిసి పోవాలని బీజేపీ ఆలోచించినా..కనీసం నోటా కంటే తక్కువ ఓట్లు రావడంతో జాతీయ పార్టీకి దిక్కు తోచడం లేదు. ఫలితంగా  రజనీకాంత్ ను దగ్గరకు తీసుకుంటుందా లేక మరో కొత్త వ్యూహంతో వెళుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. బీజేపీతో కలిసి వెళితే తాము దూరంగా ఉంటామని కొందరు ఇప్పటికే ప్రకటించారు. అన్నాదొరై, ఎంజీ చంద్రన్, జయలలిత, కరుణానిధి బాటలోనే రజనీ వెళతాడా..లేక చిరంజీవి ప్రజారాజ్యంలా మారతాడా అనేది ఇంకా ఆసక్తికరంగానే మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*