మీరంతా పూజలు చేస్తే నేను సీఎం అవుతా!

‘‘నేను సీఎం కావాలని మీరంతా పూజలు చేయండి.. దేవుళ్లను అడగండి.. టెంకాయలు కొట్టండి.. పండగ బాగా చేసుకోండి.. మీ పూజలు ఫలిస్తే.. నేను సీఎం అవుతా.. అప్పుడు మీ కష్టాలు తీరుస్తా…’’

60 రోజులుగా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్రలో భాగంగా తన వద్దకు వస్తున్న మహిళలు, ప్రజలతో చెబుతున డైలాగులు ఇలా ఉంటున్నాయి. రాష్ట్రంలో చిన్నా పెద్దా ముసలీ ముతకా అన్ని వర్గాల్లో ఏ ఒక్కిరినీ వదలకుండా.. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం నుంచి ఆర్థికంగా మాత్రమే లబ్ధి కలిగించేలాగా.. ఆ రకంగా వారు ప్రభుత్వం మీద ఆశలు పెంచుకునేలాగా జగన్మోహన్ రెడ్డి లెక్కలేనన్ని హామీలను గుప్పించేస్తూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన హామీలు వినడానికి చాలా జనరంజకంగా ఉంటున్నాయి కూడా.

మీరేమీ పనిచేయవద్దు ఇంట్లో కూర్చోండి.. మీ తిండీ తిప్పలకు ప్రభుత్వం డబ్బులిచ్చేస్తుదిం. మీ పాటికి మీరు బ్యాంకులనుంచి అప్పులు తీసుకోండి.. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిచ వాటిని సాంతం మాఫీ చేసి పారేస్తుంది.. పైగా రుణమాఫీ మొత్తాన్ని బ్యాంకులకు ఇవ్వకుండా మీ చేతికే ఇస్తుంది.. ఇలా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆర్థికంగా మీకు డబ్బులిస్తా అనే పథకాల ద్వారా జనాన్ని ఆకట్టుకోవడానికి చాలా చెబుతున్నారు. ఎన్ని కొత్త పథకాలను ఆయన చెబుతున్నప్పటికీ.. మధ్య మధ్యలో ప్రారంభంలో చెప్పుకున్న తరహా డైలాగులు.. ఆయన  ప్రసంగాల్లో పదనిసలు పాదయాత్రను ప్రహసనప్రాయంగా మార్చేస్తున్నాయి.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కష్ట నష్టాలను ఈ ప్రభుత్వం వల్ల ఎదుర్కొంటున్న వేధింపులను స్వయంగా వారినుంచే తెలుసుకుంటా.. అనే ఎజెండాతో పాదయాత్ర చేయబోతున్నట్లు ప్రారంభంలో చెప్పారు. అయతే ‘మీరంతా పూజలు చేయండి.. నేను సీఎం అవుతా’ అంటూ ఆయన జనం వద్దకు వెళ్లి చెబుతున్న మాటలను గమనిస్తే. తన కష్టాన్ని, తన మనస్తాపాన్ని ప్రజలకు నివేదించుకోవడానికి వెళ్లినట్లుగా ఉన్నదే తప్ప.. వారి వేదనల్ని వినడానికి వెళ్లినట్లుగా లేదని పలువురు ఎద్దేవా చేస్తున్నారు. పైగా పదేపదే ‘నేను సీఎం అవుతా.. మీ కష్టాలు తీరుస్తా’’ అంటూ జగన్ చెప్పే మాటలు బ్యాక్ ఫైర్ అయ్యే ప్రమాదం కూడా ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే.. ‘‘సీఎం అయితే మీ కష్టాలు తీరుస్తా.. సీఎం కాకపోతే.. మీ కష్టాల గురించి ఇక ఎంతమాత్రమూ పట్టించుకోను… ప్రభుత్వాన్ని నిలదీయను.. ప్రశ్నించను..  మీ మానానికి మిమ్మల్ని వదిలేస్తా’’ అని హెచ్చరిక ఆయన మాటల్లో ధ్వనిస్తున్నదని విశ్లేషకులు భావిస్తున్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన మాటల్లో అలాంటి సంకేతాలు కనిపిస్తున్నాయో లేదో గానీ.. ప్రజలు మాత్రం అలాగే భావిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన నాయకులు ప్రజల పట్ల తమ బాధ్యతను మరవ కూడదని,  ప్రభుత్వానికంటె ఇంకా ఎక్కువ బాధ్యతతో వ్యవహరించాలని.. అయినా.. అసెంబ్లీకే తమ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరు కూడా హాజరు కాకుండా డుమ్మా కొట్టించిన నాయకుడు.. ఇంత లోతుగా ప్రజాసేవను ఎలా అర్థం చేసుకుంటాడని కూడా కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి.

1 Comment

  1. Well written analysis of speeches in Jagan tour. If at all he comes into power and fulfills all his promises, economy of State will be horrible to imagine even and development will be nil due to funds paucity.
    2.it is funny to see, in stead of knowing people’s problems, he is continuously requesting people to bring him to power at any cost.Generally, a leader will be praying for welfare of people. Here the case is just opposite. He says, people should pray for his CM post.

Leave a Reply

Your email address will not be published.


*