చంద్రబాబు, మోడీ భేటీ బాగానే ఉంది..కానీ ఆచరణ ఉంటుందా…

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని మోడీని కలిసిన సంగతి తెలిసిందే. గంటసేపు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన చాలా విషయాల పై చంద్రబాబు చర్చించారు. ప్రధాని మోడీకి 17 పేజీల సమస్యల చిట్టాను వివరించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు. విభజన హామీలు, నిధుల విడుదల సంగతి చూడాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి 58 వేల కోట్ల అంచనాలను ఆమోదించడంతో సహా, రాజదాని నిర్మాణానికి బడ్జెట్ లో నిధులు కేటాయింపు అంశాలు ఇందులో ఉన్నాయి. అంతే కాదు..శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను 175 నుంచి 225కి పెంచాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు కోసం రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టామని…ఇందులో మరో రూ.3979 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందని ప్రస్తావించారు. 
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధి, విధి విధానాలు ఖరారు చేసి, నోటిఫికేషన్‌ జారీ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని విన్నవించారు. ఎపికి సంబంధించి చాలా అంశాలను ప్రస్తావించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ద్వారా ఇచ్చే నిధులను విడుదల చేయాలని కోరారు చంద్రబాబు. ఈఏపీ కింద ఇవ్వాల్సిన రూ.16వేల కోట్లు ఇప్పించాలని కోరాకు బాబు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటివరకు 54శాతం, ఎర్త్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. విశాఖ రైల్వేజోన్‌ విషయం త్వరగా తేల్చాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు. అదే సమయంలో రాజధాని నిర్మాణానికి ఇప్పటికి రూ.2,500కోట్లు ఇచ్చారు. విజయవాడ, గుంటూరులో అభివృద్ధి పనులకు రూ.వెయ్యికోట్లు ఇచ్చారు. 13వ షెడ్యూల్‌లో ఇచ్చిన విద్యా సంస్థలకు నిధులు అడిగాం. ప్రస్తుతానికి నా దృష్టంతా రాష్ట్రాభివృద్ధిపైనే ఉందని చంద్రబాబు మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. 
ఏపీ విషయంలో బీజేపీ సర్కార్ చెప్పే మాటలకు చేతలకు చాలా తేడా ఉంది. మరి చంద్రబాబు విజ్ఞప్తిని సానుకూలంగా తీసుకుని ఆదుకుంటే సరే. లేకపోతే ఆ మేరకు కాంగ్రెస్ ను దూరం పెట్టినట్లు ఏపీ ప్రజలు కమలం పార్టీకి ఝలక్ ఇచ్చే అవకాశముంది.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*