జేసీ అల్లుడు సస్పెండ్ డ్రామానా…

టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అల్లుడైన దీపక్‌రెడ్డి. భూ అక్రమాల కేసులో ఆయన పై కేసులు ఉన్న సంగతి తెలిసిందే. బినామీ పేర్లతో అక్రమాలు చేస్తు అడ్డంగా దొరికిపోయాడు. ఫలితంగా ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీడీపీ అధికారికంగా ప్రకటించింది. కానీ అతను సస్పెండ్ అయినా తెల్లారి నుంచే పార్టీలో తన కార్యక్రమాలను మరింత ముమ్మరంగా  చేస్తున్నాడు. ఫలితంగా అతను పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారా లేక ప్రకటన ఒక డ్రామానా అనే చర్చ సాగుతోంది.

తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండైన దీపక్ రెడ్డి తాజాగా  టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో వేదిక పై కూర్చున్నారు. దీంతో దీపక్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం జనాల కోసం తప్ప పార్టీ కోసం కాదని తేలింది. అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన  జన్మభూమి-మా ఊరు ముగింపు సభకు దీపక్ రెడ్డి హాజరయ్యారు. భూకబ్జా కేసుల్లో హైదరాబాద్‌ పోలీసులు పోయినేడు జూన్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. పార్టీ పరువు కాపాడుకునేందుకు దీపక్‌రెడ్డిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్‌ చేశారు. సీఎం చంద్రబాబు పాల్గొన్న అధికారిక కార్యక్రమాల్లో ఎమ్మెల్సీగా హాజరు కావచ్చు. అందుకే ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన పని లేదు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం, అధికార పార్టీనే కాదు..విపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులకు ఉంటంది. కానీ దీపక్ రెడ్డి అధికారిక కార్యక్రమాల తర్వాత అంతకు ముందు జరిగిన పార్టీ సమావేశాల్లోను పాల్గొనడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*