యుఎస్ లో ఉండాలనుకునే ఐటీ నిపుణులకు ఊరట

అమెరికాలో ఉండాలనుకుంటున్న భారతీయ ఐటీ నిపుణులకు ఊరట వచ్చింది. ప్రతిభ ఆధారిత వలస ద్వారా ఏటా ఇచ్చే గ్రీన్‌కార్డులను 45 శాతం చేసింది. ఈ మేరకు యుఎస్ ప్రతినిధుల సభలో చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టం ఆమోదం పొందితే గ్రీన్‌కార్డు దారుల సంఖ్య పెరగనుంది. ఇప్పుడు ఏటా 1,20,000 మందివరకు ఇలా వలస కార్డులు తీసుకుంటున్నారు. ఇప్పుడా సంఖ్య  1,75,000 వరకు పెరిగే అవకాశం ఉంది. ‘అమెరికా భవిష్యత్‌ భద్రత చట్టం’ పేరున ట్రంప్‌ ప్రభుత్వం చేపట్టిన ఈ చట్టాన్ని అమెరికన్‌ కాంగ్రెస్‌ ప్రస్తుతం చర్చిస్తోంది. గ్రీన్‌కార్డు కోసం ఏటా సుమారు 5లక్షల మంది భారతీయులు హెచ్‌1బీ వీసాను పొడిగించుకుంటున్న సంగతి తెలిసిందే.

అమెరికాలో ప్రతిభ ఉన్న వారు తక్కువగా ఉండటంతో ఇతర దేశాల ఐటీ నిపుణుల కోసం ఆలోచిస్తోంది. అందుకే వారి కోసం వెసులుబాటు కల్పించనుంది. ఇప్పటికే అమెరికాలో ఉంటున్న వారి ద్వారా మరొకరు వచ్చే విధానం పైన నిబంధనలు కఠినం కానున్నాయి. భారత్‌ నుంచి వచ్చిన ఐటీ నిపుణులు అమెరికాలో స్థిరపడిన తర్వాత తమ కుటుంబసభ్యులను తీసుకువస్తున్నారు. ఇక పై వారి బంధువులకు గ్రీన్‌కార్డ్ ఇచ్చే ఆలోచన చేయడం లేదు అమెరికా. అదే వారి పిల్లలకు, తోబుట్టులకు మాత్రమే ఈ సదుపాయం ఉండనుంది.

అంతే కాదు…అమెరికా ప్రజలకు ప్రధాన ప్రాధాన్యతనివ్వాలనే ఆలోచన చేస్తోంది ట్రంప్‌ ప్రభుత్వం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*