జై బాలయ్యా.. 102 టెంకాయ కొడతాననీ మొక్కకున్నా..

అప్పుడెప్పుడో ప్రేమాభిషేకం సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు.. ‘నూటొక్క టెంకాయ కొడతాననీ మొక్కుకున్నా…’ అంటూ ఓ సాంగేసుకున్నాడు. ఆయన కోరుకున్నట్టుగా.. అమ్మాయి కనిపించిందో లేదో.. 101 టెంకాయలు కొట్టాడో లేదో తెలియదు గానీ.. అమెరికాలోని నందమూరి బాలయ్య అభిమానులు మాత్రం ఇప్పుడు 102 టెంకాయలు కొట్టేసి ఫుల్ రేంజిలో సెలబ్రేట్ చేశారు. తమ అభిమాన హీరో నందమూరి బాలయ్య 102వ చిత్రం ‘జై సింహా’ విడుదల సందర్భంగా.. ప్రత్యేకపూజలు, ఆర్భాటపు వేడుకలను చాలా భారీ స్థాయిలోనే యూఎస్ అభిమానులు చేశారు.

వివరాల్లోకి వెళితే..

అమెరికా బే ఏరియాలోని బాలయ్య ఫ్యాన్స్ పెద్దస్థాయిలోనే హంగామా జరిగింది.. బాలయ్య చిత్రం విడుదల సందర్భంగా అన్న నందమూరి తారక రామారవు, బాలకృష్ణ చిత్రాలతో కటౌట్ ఏర్పాటుచేశారు. దిష్టితీసి 102 టెంకాయలు కొట్టేశారు.. కేవలం అదొక్కటే కాదు. 102 ఒక డాలర్ నోట్లను హారంగా చేసి.. బాలయ్య కటౌట్ కు అలంకరించారు. … 102 ఎల్బీల కేకును కోసి అభిమానులందరికీ పంచిపెట్టారు… 102 గ్యాలన్ల పాలతో సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య కటౌట్ లకు పాలాభిషేకం చేశారు. గతంలో ఏ హీరో చిత్రం విడుదల సందర్భంగా కూడా అమెరికాలో ఈ రేంజి సెలబ్రేషన్స్ జరగలేదని అంతా అనుకుంటున్నారు. బాలకృష్ణ ఈ ఏడాదిలో మోస్ట్ పవర్ ఫుల్ అండ్ ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. 2017 సంక్రాంతి నుంచి 2018 వరకు మూడు చిత్రాలు చేసిన ఏకైక టాలీవుడ్ హీరోగా బాలయ్య నవతరం రికార్డులు సృష్టించినట్టే. యంగ్ హీరోలు కాదు కదా.. వేగంగా సినిమాలు పూర్తి చేసేసే ఏ చిన్న హీరోలు కూడా చేయలేని ఫీట్ గా ఇది ప్రస్తుత పరిస్థితుల్లో టాలీవుడ్ లో కనిపిస్తోంది. ఎందుకంటే.. 2017 సంక్రాంతికి గౌతమీపుత్ర శాతకర్ణిగా వచ్చిన బాలయ్య.. రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆతర్వాత 2018 సంక్రాంతికి ‘జైసింహా’ వస్తోంది. మధ్యలో పైసా వసూల్ చిత్రం కూడా వచ్చింది. అంటే మొత్తం మూడు చిత్రాలన్న మాట. అందుకే బహుశా బాలయ్యకు దిష్టిపోవాలని .. బేఏరియా ఫ్యాన్స్ ఈ హంగామా చేసినట్లుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*