పవన్ కల్యాణ్ కు ఎదురు దెబ్బ…పులికి కోరలు పోయాయన్న వర్మ

మూలిగే నక్క మీద తాటికాయ పడటం అంతే ఇదేనేమో. అసలే అజ్ఞాతవాసి సినిమా బాగోలేదని ఫ్యాన్స్ బాధపడుతున్నారు. తమ అభిమాన నటుడు ఇలా రాంగ్ స్టెప్పు వేశాడు అని తలలు బాదుకుంటున్నారు. కోట్ల రూపాయల మేర ఈ సినిమా నిర్మాతలకు నష్టాలను మిగిల్చే అవకాశముంది. కథ, కథనం సరిగా లేకుండా డైలాగులతో సినిమాకు ముందుకు తీసుకెళ్లలేమని అర్థమవుతోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్ లోనే ఈ సినిమా మచ్చగా మిగిలిపోవడం ఖాయమంటున్నారు. అలాంటి స్థితిలో ప్రముఖ నటుడు, జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రముఖ దర్శకుడు వర్మ పోస్టింగ్ లు చేశారు. 

పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాత వాసి సినిమాపై భిన్నమైన వ్యాఖ్యలు రాశారు. రామ్ గోపాల్ వర్మ ఒక ట్వీట్ చేస్తూ పవన్‌ కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్‌ చిత్రమైన ‘పులి’ ని చూసినట్లుందని జోక్ చేశాడు.  అంతేకాదు సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి రివ్యూ బాగుందని కితాబిచ్చాడు. నేను ఓ పులిని మాత్రమే చూశాను. కోరలు, పంజాలేని పులిని ఇప్పటి వరకు చూడలేదు. కానీ పులి చారలు మారడం నన్ను ఆశ్చర్యం కలిగించింది. జంపింగ్‌ చేయాల్సిన పులి పాకడం మాత్రం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది అని వర్మ కామెంట్ పెట్టేశాడు. ఇది మరింతగా కలకలం రేపుతోంది. పవన్ కళ్యాణ్ కన్నా కత్తి అందంగా కనిపించాడని వ్యాఖ్యానించడం మరింత విచిత్రం.
ఇందుకు కత్తి సంతోషం వ్యక్తం చేశాడు. కానీ హైపర్ ఆది మాత్రం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.‘అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లుంది వీరిద్దర్నీ చూస్తే అని కామెంట్ చేశాడు. మొత్తంగా పవన్ కల్యాణ్ కు పెద్ద దెబ్బ తగిలిందనే చెప్పాలి. ఈ సినిమా పై భారీగా ఆశలు పెట్టుకుంటే ఇంతగా దెబ్బకొట్టిందే అని బాధపడుతున్నారట. సర్దార్ గబ్బర్ సింగ్ కంటే ఘోరంగా పోయిందనే టాక్ రావడం ఆ సినిమాకు మరింత ఇబ్బందేనని చెప్పాలి. 
 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*