మరోసారి వార్తల్లోకి వచ్చిన సిద్ద రామయ్య

కర్నాటక సి.ఎం సిద్దరామయ్య మరోసారి వార్తల్లోకి వచ్చారు. వాస్తు, జ్యోతిష్యాన్ని బాగా నమ్ముతారు. అవిచూసే ముందుకు వెళుతుంటారు. రేయింబవళ్లు ఆయన వాటి గురించి ఆలోచిస్తుంటారట. అందుకే నిద్రసరిగా పోడనే వాదన ఉంది. అందుకేనేమో ఎక్కడపడితే అక్కడ ఆయన పడుకుని నిద్రపోతాడు. అసెంబ్లీలోనే కాదు…ప్రెస్ మీట్ లోను ఆయన ఒక కునుకు వేస్తాడు. తాజాగా సిద్ధ రామయ్య మడికెరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం పాల్గొని నిద్రలోకి జారుకున్నారు. కెమెరాలు ఊరుకుంటాయా..అంతే వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అంతే ఆయనకు దిక్కుతోచడం లేదట.

ముందు వరుసలో కూర్చుని మరీ ముఖ్యమంత్రి గుర్రు పెట్టాడు. ‘సిద్ధ రామయ్య..ప్లీజ్‌ తొందరగా లేవండి’, ‘పని వేళల్లో నిద్రపోయే అవకాశం కేవలం జపాన్‌లోనే ఉంది’ అని జోకులు పేలుస్తున్నారు మరోవైపు నెటిజన్లు. 2017 మేలో కాంగ్రెస్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఆయన ముందు వరుసలో కూర్చుని గురక పెట్టిన సంగతి అప్పట్లో హల్ చల్ చేసింది.

కాకి కోసం కారు మార్చాడు…

సిద్ద రామయ్య ఏం చేసినా వెరైటీగానే ఉంటోంది. ఇప్పుడాయన ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే మంచి ముహూర్తం చూసుకుని వెళుతున్నారట. అలా చూడక పోతే తనకు ఇబ్బంది వస్తుందని బలంగా నమ్ముతున్నారట. ఆయనతో పాటు…ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు సిద్దాంతులు ఉంటున్నారు. గతంలో సిద్దరామయ్య కొత్త కారు కొన్నారు. కానీ ఆయన ప్రయాణించే కారు పై కాకి వాలింది. ఈ విషయాన్ని చాలా పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. కాకి వాలినా..ఇంకొకటి ఏం చేసినా తాను నమ్మేది లేదని చెప్పారు. కానీ జ్యోతిష్యులు ఊరుకోలేదట. వెంటనే కారు మార్చాలని చెప్పారట. లేకపోతే అరిష్టం జరుగుతుందని హెచ్చరించారట. పైకి తాను మూఢ నమ్మకాలు నమ్మనని చెప్పిన సి.ఎం లోపల ఉన్న కారును పక్కన పెట్టి కొత్తదాన్ని తీసుకున్నారు. ఆయనకు నెంబర్ సెంటిమెంట్ ఉంది. సి.ఎం అడగడమే ఆలస్యం లక్కీ నెంబర్ 9 వచ్చేలా చూశారు అధికారులు. సిఎం సిద్ద రామయ్య కొత్త కారు నెంబర్ కేఏ01 ఈఏ 2016అని వచ్చింది.

హెలికాప్టర్ నుదించిన సిఎం

సిద్ద రామయ్య ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఓ పక్షి ముద్దాడింది. పెద్ద ఎత్తున ఆ శబ్దం రావడంతో సి.ఎం బిత్తరపోయారట. వెంటనే హెలికాప్టర్ ను కిందకు దించాలని ఆదేశాలిచ్చారట. ఇబ్బంది లేదని పైలెట్లు చెప్పినా కాదన్నారు. ముఖ్యమంత్రి ఆదేశించడంతో కాదనలేక పైలెట్ అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో బయల్దేరిన కొద్ది సేపటికే ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే హెలికాఫ్టర్‌ను కిందికి దించేశారు. సీఎం సిద్ధరామయ్యతో పాటు హోంమంత్రి పరమేశ్వర అందులో ఉన్న సంగతి తెలిసిందే. మరో హెలికాప్టర్‌ అప్పటికప్పుడు అందుబాటులోకి రాకపోవడంతో ముహూర్తం చూసుకుని తిరిగి వెళ్లారు. 
ప్రజల కోసం ఎప్పుడు పడితే అప్పుడు బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో తిధులు, వారాలు, రాశి ఫలాలు చూసి పాలన చేస్తే కష్టమేనంటున్నాయి ఇంకోవైపు ప్రతి పక్షాలు. అయినా సరే ఊరుకోవడం లేదాయన.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*