జైలుకు పోతే హీరోలవుతారట..అమ్మ నారాయణ

సిపిఐ నారాయణ చాలా ఆసక్తికర మాటలు చెప్పారు. జైలుకు వెళితే హీరోగా మారతారట. జగన్, రేవంత్ రెడ్డి లాంటి వారు ఇప్పుడు జనాల్లో బాగా తిరుగుతున్నారనేది ఆయన అంతర్లీనంగా చెబుతున్న మాట. అదే సమయంలో చంద్రబాబు, జగన్ లు ఇద్దరు జైలుకు పోతామనే భయంతో ఏం అడగలేకపోతున్నారని చెప్పారు అమరావతి రాజధాని నిర్మాణం ఎలా ఉందో చూసేందుకు సిపిఐ నారాయణ మరో ఇద్దరితో కలిసి సచివాలయానికి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాగానే రోడ్లు వేస్తున్నారని కితాబునిచ్చారు. కానీ  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైకి చిరునవ్వు చిందిస్తూ మొండి చెయ్యి చూపిస్తున్నాడు అని ఆరోపించారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కాపిటల్ నిర్మిచాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది.. మట్టి, నీరు ఇస్తే రాజధాని అయిపోతుందా..? రెండు ఏళ్ళుగా ముఖ్యమంత్రికి అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం ఏంటి.., అమరావతి, పోలవరం నిర్మించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉంది… అని నారాయణ అన్నారు. ఒకవైపు పొగుడుతూనే మరోవైపు చంద్రబాబునాయడు, జగన్ ల పై విమర్శలు కురిపించారు. కేసులకు భయపడి మోడీని వారు ఏమి అనలేకపోతున్నారు.. భయపడి, బతిమలాడితే నిధులు రావు.. పోరాడితే లాలూ ప్రసాద్ యాదవ్ లాగా జైల్లో పెడతారు. జైలుకి వెళితే ఏం అవుతుంది.. తర్వాత హీరోలు అవుతారు.. అని నారాయణ చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

తప్పు చేసి జైలుకు వెళితే హీరోగా మారవచ్చట. లాలూ ప్రసాద్ యాదవ్‌ని జైల్లో పెట్టారు… 2019లో బీహార్‌లో ఆయన సత్తా ఏంటో చూపిస్తాడని చెప్పారు. పోరాడితే పోయేది ఏముంది జైలుకు వెళ్లడం తప్ప అనే పాట పాడుతున్నాడు నారాయణ. ఏంతైనా నారాయణ నారాయణే కదా. చంద్రబాబులో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. దక్షిణాది రాష్ట్రాల్లో మోడీ సత్తా ఏ పాటిదో మొన్న తమిళనాడు ఆర్కే నగర్ ఎన్నికల్లోనే తేలిందన్నారు. నోటా కంటే తక్కువ ఓట్లు బీజేపీకి రావడంతో మోడీకి భయం పట్టుకుందున్నారు. అందుకే లాభం లేదని చిన్న పార్టీలను మచ్చిక చేసుకునే పని చేస్తున్నారని ప్రస్తావించారు.

ఈ మధ్యనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చంద్రబాబు, నారాయణలు కలిసి విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడు నారాయణ మీద చేయి వేసి మరీ మాట్లాడారు చంద్రబాబు. కానీ స్నేహితం వేరు. రాజకీయాలు వేరు. చంద్రబాబును తిట్టాల్సిందేనంటున్నారు. సిసిలైన రాజకీయాన్ని కమ్యూనిస్టులు వంటబట్టించుకుంటున్నారనుకుంటా.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*