అనుమతులతో అడుగు పెడుతున్న జైసింహా

అజ్ఞాతవాసి ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు అంచనాలన్నీ జై సింహా మీదనే ఉన్నాయి. బాలయ్య బాబు హీరోగా నటించిన మూవీ జై సింహా. గతంలో సింహా పేరుతో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడం విశేషం. అందులోను సంక్రాతి కానుకగా వచ్చిన సినిమాలు బాగానే ఆడాయి. అందుకే జై సింహా అదరగొడుతుందనే ప్రచారం సాగుతోంది. అజ్ఞాతవాసి సినిమాకు అర్థరాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు షో వేసుకునేందుకు అనుమతించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. అలానే జై సింహా సినిమాకు కూడా అనుమతి ఇచ్చేసింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న జై సింహా సినిమాకు అర్థరాత్రి కూడా షో వేసుకునేందుకు అనుమతిస్తూ ఇస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సంక్రాంతి పండుగకు ముందు రోజు 12వ తేదినుంచి 16వ తేది వరకు అర్థరాత్రి సినిమా ప్రదర్శనకు అనుమతించారు. నందమూరి బాలకృష్ణ హీరోగా తమిళ దర్శకుడు కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కంది జై సింహా. బాలయ్య సరసన నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటించారు. బాలయ్య మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాతో సంక్రాంతి సీజన్ లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతున్నాడు బాలయ్య.

ఆడియో వేడుకలు, ప్రీరిలీజ్ పంక్షన్ ఘనంగా జరిగాయి. పైసా వసూల్ అనుకున్న మేర సక్సెస్ కాకపోవడంతో జై సింహా మీదనే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. ఇది ఎలా ఉంటుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*