వెనక్కు తగ్గిన గవర్నర్ నరసింహన్, బిల్లుకు ఆమోదం

తన పై వస్తున్న విమర్శలను తట్టుకోలేక పోయాడు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్. తెలంగాణ కాంగ్రెస్ నే కాదు..ఏపీ బీజేపీ దాడి మొదలు పెట్టింది. అందులోను టీడీపీ అసలే అసంతృప్తిలో ఉంది. ఏపీ ఆయనకు విడిదిగా మారిందనే ప్రచారం ఉంది. ఇక లాభం లేదనుకున్న గవర్నర్ వివాదాలకు పుల్ స్టాప్ పెట్టాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నాలా బిల్లుకు ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందిన ఆయన నాలా ఆర్డినెన్స్ కు ఆమోదముద్ర వేశారు.

గతంలో ఈ బిల్లు ఆయన వద్దక వచ్చినా తిప్పిపంపారు గవర్నర్‌. అసెంబ్లీలో ఆమోదం పొందిన బిల్లును ఆయన కావాలని ఆపేశారు. అదే బిల్లు తెలంగాణ ప్రభుత్వం నుంచి వస్తే ఆమోదించారు. అందుకే వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త గవర్నర్ కావాలని విష్ణుకుమార్ రాజు వంటి నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ మేరకు హస్తినలోని పార్టీ పెద్దలకు ఆయన లేఖ రాశారు. చేసేది లేక గవర్నర్ ఉక్కిరిబిక్కిరి అయ్యారు.  బిల్లు రూపంలోవచ్చిన నివేదిక పై ఆయన రెండుసార్లు అభ్యంతరాలు తెలిపారు. మరోసారి గవర్నర్‌కు ఏపీ సర్కార్ వివరణ ఇచ్చింది. దీనిపై సంతృప్తి చెందిన నరసింహన్ ఎట్టకేలకు నాలా బిల్లుకు ఆమోదముద్ర వేశారు.

ఏపీ శాసనసభ సమావేశాల్లో ఏపీ వ్యవసాయ భూమి (సాగేతర అవసరాలకు భూమి మళ్లింపు- నాలా) చట్టానికి సవరణలు చేస్తూ బిల్లును ఆమోదించారు. ఫలితంగా వివాదం సద్దుమణినట్లే. తన పై వస్తున్న విమర్శలను చాలా సున్నితంగా తోసిపుచ్చారు గవర్నర్. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి. అన్నీ సర్దుకుపోతాయని చెప్పారాయన.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*