సిపిఐ ఆధ్వర్యంలో మహాకూటమి ఏర్పాటుకు నిర్ణయం

బీజేపీ సర్కారు ఓటమి కోసం మహాసంకీర్ణాన్ని ఏర్పాటు చేసే దిశగా కదులుతున్నారు కమ్యూనిస్టులు. గతంలో యూపీలో ఏర్పాటు చేసిన కూటమి బద్దలు కావడంతో ఈ సారి ఆచితూచి కూటమి ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది. ఎన్నికల్లో గెలుపు కోసం కాకుండా ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాల పై తమ గురి పెట్టనున్నారు. మోడీ ప్రభుత్వాన్ని చెత్తబుట్ట లోకి నెట్టేయాల్సిన సమయం వచ్చిందనేది కామ్రేడ్ మాటగా ఉంది. అందుకే లాల్‌– నీల్‌ (కమ్యూనిస్టులు– దళితులు) కలసి ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులను పారదోలాలని సిపిఐ పిలుపినిచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ సహా అన్ని వర్గాల ప్రజలు, ప్రాంతీయ పార్టీలతో మహాసంకీర్ణాన్ని ఏర్పాటు చేసేందుకు సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో నిర్ణయించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన  కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి ప్రకటించారు.

విజయవాడలో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో సురవరం సుధాకర్‌రెడ్డి అందరూ కలిసి కూటమి కట్టే దిశగా చర్చలు జరుపుతామనిచెప్పారు. బీజేపీ ప్రభుత్వాన్ని తొలగించేందుకు వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు,  మేధావులు, విద్యార్థులు అంతా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రతిపాదన చేస్తున్నట్లు చెప్పారు. వారంతా కలిసి వస్తారా అనే చర్చ సాగుతోంది. ముస్లిం మైనారిటీలు, దళితులు, మేధావులు, హేతువాదులు, జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నా బీజేపీ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది. అందుకే వారినంతా ఏకతాటి పైకి తెచ్చే ప్రతిపాదన చేశారు సురవరం. 

కానీ అది అంత తేలిక కాదనేది నిజం. భావసారూప్యం కలిగిన ప్రాంతీయ పార్టీలతో కలసి పనిచేసేందుకు ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో సిపిఎం పార్టీతో కలిసి పోవాలనే ఆలోచన చేసింది. ఉద్యమంగా ప్రజల్లోకి వెళుతున్నాం. ఓట్లుగా మలచుకునే విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మన లక్ష్యం అధికారం కాదు. ప్రజలకు సేవ చేయడం. అందుకే అధికారానికి దూరంగా ఉండాల్సి వస్తుందని వారు మననం చేసుకోవడం విశేషం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*