మోడీ, చంద్రబాబు భేటీకి ముహూర్తం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తిన బాట పట్టారు.  రేపు ఉదయం 10.40 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందుకే ముందుగానే అక్కడకు బయలు దేరారు. అమరావతి రాజధాని నిర్మాణం, విభజన సమస్యలు, ప్రత్యేక ప్యాకేజి, విశాకకు రైల్వే జోన్, పోలవరం, సంక్షేమ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు నిధులు, విధులు, అనుమతులు వంటి అంశాలపై చర్చించనున్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ పై ఆర్థిక మంత్రి రాజ్ నాధ్ కు ఆయన లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీని పై మాట్లాడనున్నారు.

ఈ నెల 5న తెదేపా ఎంపీలు మోడీని కలిసి వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈఏపీలకు నిధులు నాబార్డు ద్వారా అందించాలని ఇప్పటికే జైట్లీకి చంద్రబాబు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈఏపీ నిధుల అంశంపైనా ప్రధానితో చర్చించే వీలుంది. అంతేకాదు..బీజేపీతో పొత్తు, రానున్న ఎన్నికలు, జగన్ కేసులు, నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల గెలుపు, కర్నూలు ఎమ్మెల్సీ విజయంతో పాటు..పలు అంశాల పైనా సుదీర్ఘంగా మాట్లాడనున్నారు. ఇంకోవైపు గవర్నర్ నరసింహన్ విషయంలోను ఫిర్యాదు చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ పార్టీతో పొత్తు పైనా వారి మధ్య చర్చకు వచ్చే వీలుంది. ఏడాదిన్నరగా మోడీ, చంద్రబాబులు ప్రత్యేకంగా కూర్చుని మాట్లాడుకోలేదు. ఫలితంగా ఇప్పుడు సమస్యలు కొలిక్కి వచ్చే వీలుంది. తమిళనాడులోని ఆర్కే నగర్ లో బీజేపీకి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ఫలితంగా ప్రాంతీయ పార్టీలతో కాకుండా విడిగా పోటీ చేస్తే సీమ్ సీన్ రిపీట్ అవుతుందనే ఆలోచనలో బీజేపీ ఉందంటున్నారు. అందుకే భేటీ ఏర్పాటు చేసి చర్చించేందుకు ముందుకు వచ్చారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*