ఏపీలో కేసీఆర్ కు పాలాభిషేకం…ఎందుకంటే

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏపీలోనూ అభిమానులు బాగానే ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవ సామాజిక వర్గ నేతకు రాజ్యసభ సీటు ఇస్తానని కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు కృతజ్ఞతగా, యాదవులు ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయవాడ యాదవ యువభేరీ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం ఆసక్తికరమే. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను తొలిగా మంత్రి వర్గంలోకి తీసుకున్నారు కేసీఆర్. ఆతర్వాత ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారు. గొల్లలు, కురమ, యాదవులకు మరింతగా ప్రాధాన్యతనిస్తానని ప్రకటించారు. గొర్రెలు, మేకలు, పొట్టేళ్లను ప్రత్యేకంగా ఆ సామాజిక వర్గానికి ఇచ్చి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వారు తమకు అండగా ఉంటారనే ఆలోచనతోనే ఈ పని చేస్తున్నారనిదే నిజం. 

తెలంగాణలో యాదవ, కురుమ, గొర్రెల కాపరుల అభివృద్ధికి 10 వేల కోట్లు, యాదవ-కురమ భవన్‌కు పది ఎకరాల భూమి, పదికోట్ల నిధులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రాంతం వేరైనా తమజాతికి మేలు చేశాడు కాబట్టి కృతజ్ఞతగానే కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేస్తున్నామని వారు చెబుతున్నారు. ఆయన మంచి చేశాడు కాబట్టి పాలాభిషేకం చేశారు. మరి లాలూ ప్రసాద్ యాదవ్ అక్రమాలకు పాల్పడ్డారు మరి ఆయన సంగతి ఏంటని మిగతా వారు చర్చించుకోవడం కనిపించింది.

కేసీఆర్ రాజ్యసభ అభ్యర్థి పేరు ప్రకటించేంత వరకూ, తాము రాష్ట్రంలో ప్రతిరోజూ ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తూనే ఉంటామన్నారు ఆ సామాజిక వర్గ నేతలు. ఏపీలో సిఎం చంద్రబాబునాయుడు కూడా 50 లక్షల జనాభా ఉన్న తమకు రాజ్యసభ సీటు ఇవ్వాలనే డిమాండ్ వారు చేస్తున్నారు. ఫలితంగా యనమల రామకృష్ణుడుకు ఆ సీటు కేటాయించే వీలుంది. జనాభా ప్రకారం సీట్లు ఇస్తే చంద్రబాబుకు క్షీరాభిషేకాలు చేస్తామని ఆ సామాజికవర్గం నేతలు చెప్పారు. ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో ఆ సామాజిక వర్గ నేతలు ముగ్గురే ఉన్నారు. వారి సంఖ్య పెరగాలనేది యాదవుల డిమాండ్. తమకు సీట్లు ఇచ్చిన వారికే ఓట్లు వేస్తామన్నారు. అన్ని కులాలకు నిధులు, కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లుగానే తమకు కావాలంటున్నారు వాళ్లు. 

ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు చేసే పనుల వల్ల ప్రజలు కులాల వారీగా విభజన అవుతున్నారు. అదే రాజకీయమంటే…

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*