300 కట్ లు ఇక సినిమా చూడటం ఎందుకు…

బాలీవుడ్ మూవీ పద్మావతి కాస్త పద్మావత్ గా వస్తోంది. బాలీవుడ్ జనమే కాదు…సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పద్మావత్ ఎట్టకేలకు జనవరి25న విడుదల కానుంది. ఈ మూవీ కి సెన్సార్ బోర్డు ఏకంగా 300 కట్స్ చెప్పడం ఆశ్చర్యం. ఇన్నేసి కట్ లు వేస్తే ఇక సినిమా చూడటం ఎందుకు దండగా అంటున్నారు జనాలు. అక్షయ్ కుమార్ నటించిన ప్యాడ్ మాన్ మూవీ రిపబ్లిక్ డే నాడు విడుదల కానుంది. కాబట్టి పద్మావత్ కు పోటీ తీవ్రంగా ఉంది. పద్మావత్ లో సబ్జెక్టు ఏ మాత్రం బాగోలేకపోతే కోట్లు బూడిదలో పోసిన పన్నేరే అవుతోంది. అసలే వివాదం ఉన్న చరిత్రసినిమా. పూర్తిగా విడమరిచి చెప్తే కాని అందరికీ అర్థం కాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని కట్స్ ఇవ్వడంతో దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఆందోళనకు గురవుతున్నాడు. 

డిసెంబర్ 1 వాయిదా పడ్డాక సెన్సార్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంది పద్మావత్. ఎన్ని కట్స్ ఇచ్చినా తమ రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆడనివ్వమంటూ కర్ణిసేన హెచ్చరిస్తూనే ఉంది. రాజస్థాన్, గుజరాత్ లలో విడుదలను ఆపుతామంటున్నారు. యూపీలోను అదే సీన్. వారిని ఆపడం పెను సవాల్ గానే మారింది. టాక్, రివ్యూలు చూసాకే డిసైడ్ అవుదామనుకునే ప్రేక్షకులు ప్యాడ్ మ్యాన్ వైపు మొగ్గితే అసలుకే మోసం వస్తోంది. దీపికా పదుకునే బాగా నటించినా అసలు విషయం లేకపోతే ఇక అంతే సంగతులు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*