ఎన్టీఆర్ కుమార్తె అనిపించుకుంటున్న నారా భువనేశ్వరి

అన్న ఎన్టీఆర్ కుమార్తె, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సతీమణి భువనేశ్వరి. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఈ నెల 22న దేశవ్యాప్తంగా 300 చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు ఆమె. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీగా ఉన్న నారా భువనేశ్వరి ఈ కార్యక్రమాలను చూస్తున్నారు. “ఎన్టీఆర్‌ లెజెండరీ రక్తదాన శిబిరాలు” పేరుతో పలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో  ఇవి ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు యూత్ లో అవగాహన కల్పించేందుకు ఫేస్‌బుక్‌ సంస్థతో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ఒప్పందం చేసుకుంది. రక్తదానం చేయాలని భావించే ఎవరైనా ముందుగా పేరు నమోదు చేసుకోవచ్చు.

ఒకసారి పేరు నమోదు చేసుకుంటే వారు ఎప్పుడైనా రక్తం అవసరమైతే చుట్టుపక్కల 3 కిలోమీటర్ల దూరంలో సదరు గ్రూపు రక్తదాతలకు ఫేస్‌బుక్‌ నుంచి వెంటనే సంక్షిప్త సందేశం వెళుతుంది. అంతే అలా ఇప్పటికే సుమారు 40 లక్షల మంది రక్తదాతలు ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ బ్లడ్‌బ్యాంక్‌కు రిజిస్టర్‌ అయ్యారు. సైలెంట్ గా సీఎం సతీమణి భువనేశ్వరి తీసుకున్న ఈ నిర్ణయానికి టిడిపి పార్టీ నుంచీ, ఎన్టీఆర్ అభిమానుల నుంచీ, ఏపీ ప్రజల నుంచీ విశేష స్పందన లభిస్తోంది. ఫలితంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. హెరిటేజ్ పుడ్స్ అవార్డుల పంక్షన్లో, అలానే మహిళల సాధికారిత కోసం జరిగిన సదస్సులోను భువనేశ్వరి తన స్పీచ్ తో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తన చర్యలతో సామాజిక సేవలోను ముందుంటోంది భువనేశ్వరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*