మంత్రి మాణిక్యాలరావు పై చంద్రబాబు నజర్

దుర్గగుడిలో జరిగిన పూజలు విషయంలో దేవదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు వ్యవహరించిన తీరు పై సి.ఎం చంద్రబాబునాయుడు అసంతృప్తిగా ఉన్నారట. ముందుగానే మీడియాతో మాట్లాడటం,  ఆలయంలో పూజలు జరిగాయని, కొత్త వ్యక్తి అడుగు పెట్టారని చెప్పడంతో అధికారులు అలానే నివేదికలు ఇవ్వాల్సి వచ్చిందంటున్నారు. ఫలితంగా టీడీపీ ఇరుకున పడిందనే వాదనుంది. మంత్రి మాణిక్యాలరావు బీజేపీ నేత కావడంతో ఆయన పై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారట చంద్రబాబు. అదే టీడీపీకి చెందిన నేత అయితే….కచ్చితంగా బొజ్జల, రావెలను  పదవి నుంచి పీకేసినట్లు పక్కన పెట్టేవారంటున్నారు. పూజలు జరిగాయని తెలిసినప్పుడు వెంటనే అధికారులను విచారణకు ఆదేశించి ఉంటే సరిపోయేది. లేకపోతే విపక్షాల విమర్శలను ఖండిస్తే బావుండేది. కానీ ఆ పని చేయకపోగా..తప్పుజరిగిందని చెప్పడంతో విపక్షాలకు మరింతగా ఆయుధం ఇచ్చినట్లు అయింది.

అందుకే మంత్రి మాణిక్యాలరావు పై చంద్రబాబు నజర్ ఉందని తెలుస్తోంది. చంద్రబాబుకే కాదు…ఆయన పార్టీ పైనా మంత్రి మాణిక్యాలరావుకు అదే తీరులో కోపం ఉందట. తనకు తెలియకుండానే,పిలవకుండానే పుష్కరాల ప్రారంభ కార్యక్రమం చేశారని ఆయన గతం నుంచి అంటున్నారు. విషయం ఏదైనా మంత్రి తీరు పై చంద్రబాబు, చంద్రబాబు వ్యవహారశైలి పై మంత్రి అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*