కేసీఆర్ తన ప్రత్యర్థులను వదలడం లేదు

తెలంగాణ సిఎం కేసీఆర్ ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. ఆరోగ్యం బాగోలేక పోయినా మరోకటి అయినా ప్రత్యర్థిని కోలుకోనివ్వడం లేదు. తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన నేతను వదల్లేదు. అరెస్టు చేసేంత వరకు నిద్రపోలేదంటున్నారు. తెలంగాణ టిడిపి రైతు విభాగం అధ్యక్షుడు, గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై పోటీచేసిన వంటేరు వేణుగోపాలరెడ్డి విషయంలో ఇది జరిగింది. ఆయన్ను ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. నెల రోజుల కిందటే ఆయన కేసు నమోదు అయింది. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్నాడు. అయినా పోలీసులు వదల్లేదు. పక్కా సమాచారంతో హైదరాబాద్ సుచిత్ర జంక్షన్ వద్ద పోలీసులు ఆ నేతను అదుపులోకి తీసుకున్నారు.

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి మురళి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అల్లర్లు జరిగాయి. ఇందుకు బాధ్యుడని ఆరోపిస్తూ వంటేరు వేణుగోపాల్ రెడ్డి కేసు నమోదైంది. ఓయూలో అల్లర్ల సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అందుకే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. గొడవలకు కారణమైన..అందులోను తన ప్రత్యర్థి అయిన వంటేరును వదలి పెట్టవద్దని సిఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారంటున్నారు. ఫలితంగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనే కాదు..మిగతా వారు ఎవరైనా తమకు వ్యతిరేకంగా చేస్తే కేసుల పెడతామనే సంకేతాలు ఇచ్చారు కేసీఆర్. ఫలితంగా కేసీఆర్ తీరు వివాదస్పదమవుతోంది.

ఎమ్మార్ఫీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పైనా ఇలానే కేసీఆర్ కేసులు పెట్టించి ఇబ్బంది పెడుతున్నారనే చర్చ సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*