అనుమతి ఇచ్చామనిపించుకున్నారు…కేసీఆర్

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు తెలంగాణ సర్కార్‌ షాకిచ్చిన సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి సినిమాను అర్థరాత్రి వేస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. ఫలితంగా మరోసారి పవన్ కల్యాణ్ అభిమానులు, సినీ పరిశ్రమ పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వం పూర్తిగా అనుమతులిచ్చింది. కనీసం మీరు కొద్దిరోజులైనా ఏదో ఒక రకంగా అనుమతి ఇవ్వాలని అడిగారట. మరీ మోహమాటం పెట్టడంతో ఇక చేసేది లేక మధ్యే మార్గం చెప్పారట. తెలంగాణ ప్రభుత్వం ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలకు నో చెప్పినా ఉదయం పూట స్పెషల్‌ షోలు వేసుకోవచ్చని చెప్పేసింది. ఫలింతగా పవన్ ప్యాన్స్ ఫుల్ ఖుషీఅయ్యారు. గతంలో ప్రీమియర్ షోలు వేసినప్పుడు పలుచోట్ల తొక్కిసలాటలు జరిగిన విషయాన్ని గుర్తు చేశారు పోలీసులు. అందుకే ఈ సారి అలా జరగవద్దనే ఆలోచనతో అభిమానులు సహకరించాలని పోలీసులు కోరారు.

తెలంగాణ‌లో ప్రీమియ‌ర్ షోల‌కు నోచెప్పిన ప్ర‌భుత్వం ..కొద్దిసేప‌టికే మాట మార్చింది. అర్థరాత్రి షోలు కాకపోయినా 10వ తేదీ ఉదయం నుండి రెగ్యులర్ గా వేసే 4 రోజులతో పాటు అదనంగా ఒక షోను వేయవచ్చని చెప్పింది.  అది కూడా ఉదయం 8 గంటలకు వేయాలని చెప్పేశారు. అంటే మొత్తంగా తెలంగాణలోను ఐదు షోలు నడుస్తాయి. అదే ఏపీలోనైతే ఆరు నుంచి ఏడు వరకు నడుస్తున్నాయి. తనను కలిసి మరీ విన్నవించాడు పవన్ . కాదంటే బాగోదనే ఆలోచనతో కేసీఆర్ ఆ మాత్రం వెసులుబాటు ఇచ్చారంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*