కాంగ్రెస్ లో చేరికలను ఆ పార్టీ నేతలే కాదనుకుంటున్నారా…

సంక్రాంతి పండుగ తర్వాత కాంగ్రెస్‌లో కొత్తగా చేరికలు భారీగానే ఉండనున్నాయి. అయితే వారు ఎవరు.  ఏయే పార్టీలో నుంచి రానున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది. టిపిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎఐసిసి ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ ఆర్‌సి కుంతియా మాటల్లో చెప్పాలంటే కచ్చితంగా పెద్ద నేతలు తమ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టిఆర్‌ఎస్ నుంచి ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి వలసలు ప్రారంభం అవుతాయన్నది వారి మాటల్లో ఉన్న సారాంశం.  తెలంగాణలో సంక్రాంతి పండుగకు ముందు మంచి రోజులు (పీడ దినాలు) అని భావిస్తారు. పండుగ తర్వాత భారీగా చేరికలు ఉంటాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. 

కానీ కాంగ్రెస్‌లో చేరేందుకు నేతలు కొందరు సిద్దమైనా అప్పటికే అక్కడ ఉన్న వారితో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కాంగ్రెస్ నేతల్లో అనైక్యత, అభద్రతాభావంతో కొంత మంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరారు. రేవంత్ రెడ్డి చేరిక తర్వాతా భారీగానే చేరతారని అంచనా వేశారు. కానీ మధ్యలో కొందరు నేతలు అడ్డుకోవడంతో ఇబ్బందిగా మారిందంటున్నారు. జిల్లా నాయకుల మధ్య సమన్వయ ఇందుకు కారణం. వేరే పార్టీల నుంచి వచ్చే నాయకులు ఇప్పుడు తటపటాయిస్తున్నారు. రేవంత్ రెడ్డి టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు… మాజీ ఎమ్మెల్యేలు సీతక్క, వేం నరేందర్ రెడ్డి, బోడ జనార్ధన్ లు పార్టీలో చేరారు. మాజీ మంత్రి ఉమా మాధవ రెడ్డి హస్తం పార్టీకి వస్తానని చెప్పినా స్థానిక నేతలు వద్దన్నారట. ఫలితంగా ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు బెట్టుగా టీఆర్ఎస్ లో చేరారు. నల్లగొండ కాంగ్రెస్ నాయకులు పెద్దగా ఆసక్తి కనబరచకపోవడమే ఆమె అటువైపు వెళ్లేందుకు కారణమైందనే ప్రచారం ఉంది. 

అక్కడే కాదు…వివిధ జిల్లాల్లోనూ నేతల మధ్య సమన్వయం లేక కాంగ్రెస్‌లో చేరాల్సిన నేతలు… టిఆర్‌ఎస్‌ లేక బిజెపికి వెళుతున్నారనే వాదన లేకపోలేదు. అందుకే మరోసారి అలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఉత్తమ్ తోపాటు..సీనియర్లు రంగంలోకి దిగుతున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*