చింతమనేని తీరుతో టీడీపీకి చింత

పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే, విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి నోరుజారడంతో సి.ఎం చంద్రబాబునాయుడు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారట. మరోసారి ఇలాంటివి పునరావృత్తం కావద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రభుత్వ అధికారిని బూతులు తిట్టిన సంగతి తెలిసిందే. ఓ టీడీపీ ఎమ్మెల్యే  ఇలా చేస్తారా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. పెదవేగి మండలం విజయరాయిలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని.. వేదికపై మహిళా ప్రెసిడెంట్, ఎంపీటీసీలు ఉండగానే ఓ అధికారిని అమ్మనా బూతులు తిట్టారు.

కార్డ్‌లెస్ మైక్ ఎందుకు ఏర్పాటు చేయలేదనేది కారణం. అంతే ఆ పంచాయితీ సెక్రటరీపై చిందులేశారు. ఇంతలో మైక్ సెట్ ఏర్పాటు చేసిన వ్యక్తికి, పంచాయితీ సెక్రటకరీ ఫోన్ చేశారు. ఇప్పుడు, ఎవడికి ఫోన్ చేస్తావురా..కొడకా… అంటూ బూతులు మాట్లాడారు. మహిళా నేతలు సిగ్గుపడేలా ఆయన అసభ్యకరంగా మాట్లాడటం వివాదం రేపుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే, అందులోనూ విప్. అలాంటి పదవిలో ఉంటూ నోటికొచ్చినట్లు తిడితే ఊరుకుంటారా…కనీసం ఎలా మాట్లాడాలో తెలియదా అనే విమర్శలు వస్తున్నాయి. విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై ఎమ్మెల్యే స్థాయిలో నోరు పారేసుకోడం చర్చనీయాంశమైంది. తన కంటే వయస్సులో పెద్దవాడనే గౌరవం లేకుండా మాట్లడం పట్ల దుమారం రేగుతోంది.

వివాదాలు కొత్తేం కాదు…

చింతమనేని ప్రభాకర్ కు వివాదాలు కొత్తేం కాదు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు టిడిపి ఎమ్మెల్యే అయిన ఆయన వివాదస్పద నేతగా పేరు తెచ్చుకున్నాడు. తనకు ఎవరైనా ఎదురు చెప్పినా చెప్పింది చేయకపోయినా ఎవరినీ వదలడంటారు. అధికారుల పై దౌర్జన్యం చేయడం ఆయనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదనే వాదనుంది. మీడియాను వదలడు. ముసునూరు ఎమ్మెల్యే వనజాక్షి పై దాడి చేసినా ఆమెదే తప్పు అని నిరూపించిన ఘనుడు. కొల్లేరులో అక్రమంగా చేపల పెంపకం చేస్తున్నా..పట్టించుకున్న నాధుడు లేడంటారు. అటవీ శాఖ అధికారులు అదేమని అడిగితే వారినే తిట్టి పంపిన నేత. నిబంధనలకు విరుద్దంగా రోడ్లు వేస్తాడు. అడిగితే దౌర్జన్యనం చేస్తాడు. అసలు ఆయన నియోజకవర్గం మరో సామ్రాజ్యంలా ఉంటోంది. పోలీసు అధికారుల పైనా ఆయన నోరు పారేసుకున్న సంగతి తెలిసిందజే. సి.ఎం చంద్రబాబునాయుడు వార్నింగ్ ఇవ్వడం తప్ప మరేం చర్యలు తీసుకోలేదు. 

ఇప్పుడు ఆ ఎమ్మెల్యే దౌర్జన్యం మరీ పెచ్చుమీరుతోంది. ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామం లింగారావుగూడెం వాసుల పైనా ఆయన దాడి చేశారనే పిర్యాదులు వచ్చాయి. తెలుగుదేశం ఇంటింటికి కార్యక్రమం సందర్భంగా స్థానిక సమస్యలపై విజ్ఞప్తి చేసిన వారినీ వదల్లేదు.  మహిళలు, చిన్నారులని చూడకుండా బూతులు తిట్టారు. వారి ఇళ్లలోని సామాన్లు బయటపారేయించారనే ఆరోపణలు వచ్చాయి. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేసినా లైట్ తీసుకున్నారు. అతని వ్యవహార శైలితో మంత్రి పదవి చేతి దాకా వచ్చి ఆగిందంటారు. మీ వల్లనే నాకు మంత్రి పదవి రాలేదని గతంలో మీడియా పైన  ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. పెదపాడు, ఏలూరు, భీమడోలు అటవీ శాఖ డిప్యూటీ రేంజర్లు గంగారత్నం, వెంకటరెడ్డి, ఈశ్వర్‌ లను తిట్టిన విషయంలో ఇంకా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. 

సి.ఎం చంద్రబాబునాయుడు ఆయన విషయంలో ఏదో ఒక చర్య తీసుకోకపోతే అది టీడీపీకే నష్టం అంటున్నారు పార్టీ సీనియర్లు. మరి చంద్రబాబు ఏం చేస్తారో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*